Rammanave seluvuni ravva mammum jeyanela

రమ్మనవే చెలువుని రవ్వ మమ్ముఁ జేయనేల
Language

(॥పల్లవి॥)
రమ్మనవే చెలువుని రవ్వ మమ్ముఁ జేయనేల
తమ్మిపువ్వుల వాట్లు దాఁకుదాఁకానా

(॥॥)
గక్కనఁ జూచినంతనే కన్నులనే పెండ్లాయ
వెక్కసపు తలఁబాలు వేగినంతానా
పక్కన నవ్వినంతనే పాలకూళ్లు సెలవాయ
మక్కువతో బువ్వములు మాపుదాఁకానా

(॥॥)
తోలుతటిసిగ్గులె దొడ్డ తెరమఱఁగాయ
వలిపెపు తెరమాటు వడి వింకానా
సొలపులమాటలవే సోబాన పాటలాయ
చలివాసె పేరటాండ్ల సంద డింకానా

(॥॥)
పైనొరగినప్పుడే పరవని పరపాయ
నానఁబెట్టి నాగవల్లి నాఁటిదాఁకానా
ఆనుక శ్రీవేంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
మేనిలోని సంతసాలు మెచ్చుదాఁకాఁనా

(||pallavi||)
rammanave sĕluvuni ravva mammum̐ jeyanela
tammibuvvula vāṭlu dām̐kudām̐kānā

(||||)
gakkanam̐ jūsinaṁtane kannulane pĕṁḍlāya
vĕkkasabu talam̐bālu veginaṁtānā
pakkana navvinaṁtane pālagūḽlu sĕlavāya
makkuvado buvvamulu mābudām̐kānā

(||||)
toludaḍisiggulĕ dŏḍḍa tĕramaṟam̐gāya
valibĕbu tĕramāḍu vaḍi viṁkānā
sŏlabulamāḍalave sobāna pāḍalāya
salivāsĕ peraḍāṁḍla saṁda ḍiṁkānā

(||||)
painŏraginappuḍe paravani parabāya
nānam̐bĕṭṭi nāgavalli nām̐ṭidām̐kānā
ānuga śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ nannum̐ gūḍĕ
meniloni saṁtasālu mĕchchudām̐kām̐nā