రమ్మనవే చెలియా రమణుని నీడకు
(॥పల్లవి॥)
రమ్మనవే చెలియా రమణుని నీడకు
వుమ్మగిలిన వలపు లుట్టిఁగట్టఁ దగదే
(॥రమ్మ॥)
సంగాతాలు సేయనేల జంపులఁ బెట్టఁగనేల
కొంగువట్టి తియ్యనేల కొంకఁగ నేల
అంగము చెనక నేల అవ్వలిమోము గానేల
ముంగిటనున్న వలపు మూలవేయఁదగదే
(॥రమ్మ॥)
ఆసలు రేఁచఁగనేల అనుమానించఁగ నేల
సేసలు వెట్టఁగనేల సిగ్గులేల
పోసరించి నవ్వనేల పొద్దులు గడపనేల
వాసితోఁ గూడే వలపు వలఁబెట్టఁదగదే
(॥రమ్మ॥)
సన్నలు సేయఁగనేల సారె గుట్టు చూపనేల
కన్నుల మొక్కఁగ నేల గరువమేల
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డింతసేసి నన్నుఁగూడె
యెన్నికకెక్కిన వల పెడయఁగఁదగదే
(||pallavi||)
rammanave sĕliyā ramaṇuni nīḍagu
vummagilina valabu luṭṭim̐gaṭṭam̐ dagade
(||ramma||)
saṁgādālu seyanela jaṁpulam̐ bĕṭṭam̐ganela
kŏṁguvaṭṭi tiyyanela kŏṁkam̐ga nela
aṁgamu sĕnaga nela avvalimomu gānela
muṁgiḍanunna valabu mūlaveyam̐dagade
(||ramma||)
āsalu rem̐sam̐ganela anumāniṁcham̐ga nela
sesalu vĕṭṭam̐ganela siggulela
posariṁchi navvanela pŏddulu gaḍabanela
vāsidom̐ gūḍe valabu valam̐bĕṭṭam̐dagade
(||ramma||)
sannalu seyam̐ganela sārĕ guṭṭu sūbanela
kannula mŏkkam̐ga nela garuvamela
yinniḍā śhrīveṁkaḍeśhum̐ ḍiṁtasesi nannum̐gūḍĕ
yĕnnigagĕkkina vala pĕḍayam̐gam̐dagade