రమ్మనవే చెలియా రమణుని నీడకు
(॥పల్లవి॥)
రమ్మనవే చెలియా రమణుని నీడకు
యిమ్మనవే చనవులు యెలయింపు లేఁటికే
(॥॥)
కన్నులఁజూచిన దాకాఁకడలేదు తమకము
సన్నల మొక్కినదాఁకా చల్లీఁగూరిమి
మన్నన లడుగుదాఁకా మలసీఁ గోరికలు
యెన్ని లేవు యెడమాట లింకా నేఁటికే
(॥॥)
సరసమాడినదాఁకా జడి వట్టీఁ జెమటలు
వరసకు వచ్చు దాఁకా వంచీఁ జలము
గరిమఁ బై కొన్న దాఁకాఁ గమ్మీ నడియాసలు
ఇరవై నడుమఁ దెర యిఁక నేఁటికే
(॥॥)
కదిసి కూడిన దాఁకా కడుఁ జన్ను లదరీని
పెదవి యానిన దాఁకా నిదే నోరూరీ
అదన శ్రీ వేంకటేశుఁ డంత లోనె నన్నుఁ గూడె
యెదుటనే వొడఁబాటు లింకా నేఁటికే
(||pallavi||)
rammanave sĕliyā ramaṇuni nīḍagu
yimmanave sanavulu yĕlayiṁpu lem̐ṭige
(||||)
kannulam̐jūsina dāgām̐kaḍaledu tamagamu
sannala mŏkkinadām̐kā sallīm̐gūrimi
mannana laḍugudām̐kā malasīm̐ gorigalu
yĕnni levu yĕḍamāḍa liṁkā nem̐ṭige
(||||)
sarasamāḍinadām̐kā jaḍi vaṭṭīm̐ jĕmaḍalu
varasagu vachchu dām̐kā vaṁchīm̐ jalamu
garimam̐ bai kŏnna dām̐kām̐ gammī naḍiyāsalu
iravai naḍumam̐ dĕra yim̐ka nem̐ṭige
(||||)
kadisi kūḍina dām̐kā kaḍum̐ jannu ladarīni
pĕdavi yānina dām̐kā nide norūrī
adana śhrī veṁkaḍeśhum̐ ḍaṁta lonĕ nannum̐ gūḍĕ
yĕduḍane vŏḍam̐bāḍu liṁkā nem̐ṭige