Rammanave seli yaa rasigumdu taa nerumgu

రమ్మనవే చెలి యా రసికుఁడు తా నెరుఁగు
Language

(॥పల్లవి॥)
రమ్మనవే చెలి యా రసికుఁడు తా నెరుఁగు
వుమ్మగిలే తమకము వొడ్డుకుంటేఁ బోవునా

(॥రమ్మ॥)
తలఁపులో నావలపు తగులక విడువదు
పెలుచై తానేల తప్పించుకొనీనే
సొలసేటినాసొలపు సూడువట్టకపోదు
పలుమారు తానేల పరాకు సేసీనే

(॥రమ్మ॥)
ఆసపడి చూచేచూపు అంటుకోక విడువదు
సేసుకొన్న వాఁడు యాల సిగ్గవడీనే
వాసితోడి నా మొక్కు వరము గొనకపోదు
వోసరించి తానేల వూరకుండీనే

(॥రమ్మ॥)
మేలుమీఁదినాకాఁగిలి మెప్పించక విడువదు
తాలిమిఁ దనబత్తేల దాఁచుకొనీనే
యీలీల శ్రీవేంకటేశుఁ డిట్టె తానె వచ్చి కూడె
నాలాగులకు మెచ్చి నవ్వులేల నవ్వీనే

(||pallavi||)
rammanave sĕli yā rasigum̐ḍu tā nĕrum̐gu
vummagile tamagamu vŏḍḍuguṁṭem̐ bovunā

(||ramma||)
talam̐pulo nāvalabu tagulaga viḍuvadu
pĕlusai tānela tappiṁchugŏnīne
sŏlaseḍināsŏlabu sūḍuvaṭṭagabodu
palumāru tānela parāgu sesīne

(||ramma||)
āsabaḍi sūsesūbu aṁṭugoga viḍuvadu
sesugŏnna vām̐ḍu yāla siggavaḍīne
vāsidoḍi nā mŏkku varamu gŏnagabodu
vosariṁchi tānela vūraguṁḍīne

(||ramma||)
melumīm̐dināgām̐gili mĕppiṁchaga viḍuvadu
tālimim̐ danabattela dām̐sugŏnīne
yīlīla śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ tānĕ vachchi kūḍĕ
nālāgulagu mĕchchi navvulela navvīne