(॥పల్లవి॥)
రమ్మనవే రమణుని రతికేలికి
పమ్మిన తరితీపుల భావ మొక్కటే
(॥రమ్మ॥)
చెమటలఁ దొప్పఁదోఁగేసింగారాలే వింతగాని
తమకము సరియే తనకు నాకు
మమకారములతోడిమాఁటలే వింతగాని
సుముఖపుమొగమోటచూపు లొక్కటే
(॥రమ్మ॥)
నగువేళ సెలవులనవ్వులే వింతగాని
తగులమి సరియే తనకు నాకు
అగపడ్డప్రియములఅసలే వింతగాని
వెగటుగాని మోవులవిందు లొక్కటే
(॥రమ్మ॥)
పలుమారు గాఁగిటిలో పంతములే వింతగాని
తలఁపులు సరియే తనకు నాకు
అలమి శ్రీవేంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
కలకాలముఁ బాయనికాంక్ష లొక్కటే
(||pallavi||)
rammanave ramaṇuni radigeligi
pammina taridībula bhāva mŏkkaḍe
(||ramma||)
sĕmaḍalam̐ dŏppam̐dom̐gesiṁgārāle viṁtagāni
tamagamu sariye tanagu nāgu
mamagāramuladoḍimām̐ṭale viṁtagāni
sumukhabumŏgamoḍasūbu lŏkkaḍe
(||ramma||)
naguveḽa sĕlavulanavvule viṁtagāni
tagulami sariye tanagu nāgu
agabaḍḍapriyamulaasale viṁtagāni
vĕgaḍugāni movulaviṁdu lŏkkaḍe
(||ramma||)
palumāru gām̐giḍilo paṁtamule viṁtagāni
talam̐pulu sariye tanagu nāgu
alami śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ nannum̐ gūḍĕ
kalagālamum̐ bāyanigāṁkṣha lŏkkaḍe