Rammanave ramanuni raampulu seyamganela

రమ్మనవే రమణుని రాఁపులు సేయఁగనేల
Language

(॥పల్లవి॥)
రమ్మనవే రమణుని రాఁపులు సేయఁగనేల
సమ్మతాయఁ బనులెల్లా జాగు లిఁక నేఁటికి

(॥రమ్మ॥)
తనివోని తమకము తనమీఁద నుండఁగాను
మనసులో నాడుకోలుమాట లుండఁగా
చెనకిన చెనకులు చెక్కులపై నుండఁగాను
యెనసిన చుట్టరిక మెట్టు వాయనిచ్చునే

(॥రమ్మ॥)
సొరిది నాచూపు తనుఁ జట్టుకొని వుండఁగాను
సిరులకొప్పున తనసేస వుండఁగా
పొరిఁ దనతమ్ములము పుక్కిట నాకుండఁగాను
మరిగిన నాయాసలు మరవనేలిచ్చునే

(॥రమ్మ॥)
చెప్పిన మనవి తనచిత్తములో నుండఁగాను
చొప్పుగా నామేనఁ దనసొమ్ము లుండఁగా
ఇప్పుడె శ్రీవేంకటేశుఁ నలమేలుమంగను
వొప్పుగ నన్నేలె నిఁక వొరయనేలిచ్చునే

(||pallavi||)
rammanave ramaṇuni rām̐pulu seyam̐ganela
sammadāyam̐ banulĕllā jāgu lim̐ka nem̐ṭigi

(||ramma||)
tanivoni tamagamu tanamīm̐da nuṁḍam̐gānu
manasulo nāḍugolumāḍa luṁḍam̐gā
sĕnagina sĕnagulu sĕkkulabai nuṁḍam̐gānu
yĕnasina suṭṭariga mĕṭṭu vāyanichchune

(||ramma||)
sŏridi nāsūbu tanum̐ jaṭṭugŏni vuṁḍam̐gānu
sirulagŏppuna tanasesa vuṁḍam̐gā
pŏrim̐ danadammulamu pukkiḍa nāguṁḍam̐gānu
marigina nāyāsalu maravanelichchune

(||ramma||)
sĕppina manavi tanasittamulo nuṁḍam̐gānu
sŏppugā nāmenam̐ danasŏmmu luṁḍam̐gā
ippuḍĕ śhrīveṁkaḍeśhum̐ nalamelumaṁganu
vŏppuga nannelĕ nim̐ka vŏrayanelichchune