Rammanave maani rasanalu taa

రమ్మనవే మాని రచనలు తా
Language

(॥పల్లవి॥)
రమ్మనవే మాని రచనలు తా
నెమ్మదిఁ గూడిన నేఁడే రేపు

(॥రమ్మ॥)
నల్లని మేనికేలే నడురేయి తన
తెల్లని కన్నులకేలే తెల్లవాఱను
కల్లజంపులు సేసి కాఁకలఁ దా
బల్లిదుండై తేఁ బగలే రేయి

(॥రమ్మ॥)
సిగ్గుల మోము కేలే చిఱునవ్వు తన
నిగ్గుల చూపులకేలే నెరసులు
దగ్గఱి యింకా నేలే తమకము తా
వెగ్గలము వలచిన వెలియే లోను

(॥రమ్మ॥)
తావులమేనికేలే తాపము తన
కావులకన్నుల కేలే కనరులు
శ్రీవేంకటపతి చెలువుండిట్లే
కావలె నంటే కడయే నడుము

(||pallavi||)
rammanave māni rasanalu tā
nĕmmadim̐ gūḍina nem̐ḍe rebu

(||ramma||)
nallani menigele naḍureyi tana
tĕllani kannulagele tĕllavāṟanu
kallajaṁpulu sesi kām̐kalam̐ dā
balliduṁḍai tem̐ bagale reyi

(||ramma||)
siggula momu kele siṟunavvu tana
niggula sūbulagele nĕrasulu
daggaṟi yiṁkā nele tamagamu tā
vĕggalamu valasina vĕliye lonu

(||ramma||)
tāvulamenigele tābamu tana
kāvulagannula kele kanarulu
śhrīveṁkaḍabadi sĕluvuṁḍiṭle
kāvalĕ naṁṭe kaḍaye naḍumu