Rammanave imkanu nee ramanunini

రమ్మనవే ఇఁకను నీ రమణునిని
Language

(॥పల్లవి॥)
రమ్మనవే ఇఁకను నీ రమణునిని
పమ్మి వలపులు చల్లీఁ బదిమారులు

(॥రమ్మ॥)
నెలకొ నప్పటనుండి నిన్నే తప్పకచూచీ
తలపోసి తలపోసి తడఁబడీని
మొలకనవ్వులతోడ మూతులు గిరిపీనదె
నలువంక పొంచి పొంచి నవ్వులు నవ్వీని

(॥రమ్మ॥)
పెనఁగుచుఁ బలుమారు పెచ్చుపెరగీఁ దాను
గునిసి పరులమీఁద కోపగించీని
వెనుకొని నీజాడలే వెదకీ నితఁడు నేఁడు
మనసుమర్మాలు చూడ మచ్చికసేసీని

(॥రమ్మ॥)
పొరుగుపొంతలనుండి బుద్దులు చెప్పీనదె
గరిమల మించీఁ గలికితనమునను
యిరవై శ్రీవేంకటేశుఁ డిన్నిటా నిన్నుఁ గలసె
సరసములాడుతానే చనవు చూపీని

(||pallavi||)
rammanave im̐kanu nī ramaṇunini
pammi valabulu sallīm̐ badimārulu

(||ramma||)
nĕlagŏ nappaḍanuṁḍi ninne tappagasūsī
talabosi talabosi taḍam̐baḍīni
mŏlaganavvuladoḍa mūdulu giribīnadĕ
naluvaṁka pŏṁchi pŏṁchi navvulu navvīni

(||ramma||)
pĕnam̐gusum̐ balumāru pĕchchubĕragīm̐ dānu
gunisi parulamīm̐da kobagiṁchīni
vĕnugŏni nījāḍale vĕdagī nidam̐ḍu nem̐ḍu
manasumarmālu sūḍa machchigasesīni

(||ramma||)
pŏrugubŏṁtalanuṁḍi buddulu sĕppīnadĕ
garimala miṁchīm̐ galigidanamunanu
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā ninnum̐ galasĕ
sarasamulāḍudāne sanavu sūbīni