రమ్మనవమ్మ విభుని రత్నాలపెట్టె
(॥పల్లవి॥)
రమ్మనవమ్మ విభుని రత్నాలపెట్టె
చిమ్ముకొన గోళ్ళ నారీశిరోమణి
(॥రమ్మ॥)
చిత్తగించవమ్మ పతిఁ జిలుకలకొలికి
చిత్తజుదీమమా వోసింగారదండా
గుత్తపుగుబ్బలతీరు కొనియాడీ నీమగఁడు
బత్తి చేకొనఁగదమ్మ బంగారుబొమ్మ
(॥రమ్మ॥)
సుద్దులు చెప్పఁగదమ్మ చొప్పాణిముత్తెమా
పొద్దువొద్దు నీపతికి పువ్వారుఁబోణి
అద్ది జవ్వాది వూసీ నీ కతఁడు కారుమెఱుఁగ
వద్దనక చేకొనవో వనముకోగిలా
(॥రమ్మ॥)
ముచ్చటలాడఁగదమ్మ ముంగిటినిధానమా
గచ్చులేల రా వోచెంగలువబంతీ
హెచ్చి శ్రీవేంకటేశుఁడు యిన్నిటాను నిన్నుఁ గూడె
రచ్చకెక్కె నీవలపు రాయంచకొదమా
(||pallavi||)
rammanavamma vibhuni ratnālabĕṭṭĕ
simmugŏna goḽḽa nārīśhiromaṇi
(||ramma||)
sittagiṁchavamma padim̐ jilugalagŏligi
sittajudīmamā vosiṁgāradaṁḍā
guttabugubbaladīru kŏniyāḍī nīmagam̐ḍu
batti segŏnam̐gadamma baṁgārubŏmma
(||ramma||)
suddulu sĕppam̐gadamma sŏppāṇimuttĕmā
pŏdduvŏddu nībadigi puvvārum̐boṇi
addi javvādi vūsī nī kadam̐ḍu kārumĕṟum̐ga
vaddanaga segŏnavo vanamugogilā
(||ramma||)
muchchaḍalāḍam̐gadamma muṁgiḍinidhānamā
gachchulela rā vosĕṁgaluvabaṁtī
hĕchchi śhrīveṁkaḍeśhum̐ḍu yinniḍānu ninnum̐ gūḍĕ
rachchagĕkkĕ nīvalabu rāyaṁchagŏdamā