రమ్మనరే చెలులాల రమణుని నీడకు
(॥పల్లవి॥)
రమ్మనరే చెలులాల రమణుని నీడకు
తమ్మివాట్లకు నేలే తనివోని సిగ్గులు
(॥రమ్మ॥)
చేయిమీఁదుగా లోలోఁ జేసినదే చేఁతగాక
పాయపువారికినేలే పాడిపంతాలు
ఆయములు సోఁక నాడినదే దక్కెఁగాక
కాయజతంత్రాన కేలే కడునొఁబాటులు
(॥రమ్మ॥)
కోలుముందుగా రతిఁ గొన్న దే కోలుగాక
ఆలిమగని కేలే అవుఁగాములు
కేలు గేలు మోవఁ బెనఁగినదే మంచిదిగాక
మేలు గలచోటనేలే మెదకతనములు
(॥రమ్మ॥)
మనసునఁ గలట్టెల్లా మచ్చికఁ గూడుతగాక
తనకు నాకూనేలే తలపోఁతలు
యెనసె శ్రీవెంకటేశుఁ డే నలమేలు మంగను
ననుపైతే మరియేలే నానావిచారాలు
(||pallavi||)
rammanare sĕlulāla ramaṇuni nīḍagu
tammivāṭlagu nele tanivoni siggulu
(||ramma||)
seyimīm̐dugā lolom̐ jesinade sem̐tagāga
pāyabuvāriginele pāḍibaṁtālu
āyamulu som̐ka nāḍinade dakkĕm̐gāga
kāyajadaṁtrāna kele kaḍunŏm̐bāḍulu
(||ramma||)
kolumuṁdugā radim̐ gŏnna de kolugāga
ālimagani kele avum̐gāmulu
kelu gelu movam̐ bĕnam̐ginade maṁchidigāga
melu galasoḍanele mĕdagadanamulu
(||ramma||)
manasunam̐ galaṭṭĕllā machchigam̐ gūḍudagāga
tanagu nāgūnele talabom̐talu
yĕnasĕ śhrīvĕṁkaḍeśhum̐ ḍe nalamelu maṁganu
nanubaide mariyele nānāvisārālu