రమ్మనఁగాఁ దనతో నే రా నంటినా
(॥పల్లవి॥)
రమ్మనఁగాఁ దనతో నే రా నంటినా
చిమ్ముచు నింత ప్రియము చెప్ప నేలె నాకు
(॥రమ్మనగా॥)
వెల్లవిరిఁ దనమాఁట విన నైతినా నేను
చెల్లఁబో నా కేల సేవ సేసీని తాను
యెల్లవారిఁ దా నేలీ నెవ్వరిఁ బోలుదు నేను
బల్లిదుఁడు నా కేల బాఁతి పడీఁ దానూ
(॥రమ్మనగా॥)
చెప్పిన ట్టెల్లా నేను సేయకుండేదాననా
అప్పటి లేక లేఁటికి నంపీనె తాను
కప్పురపు పడిగల కాంతలు గాచుకుండఁగా
విప్పుచు నాకుఁగా నేల వేగించేనె తానూ
(॥రమ్మనగా॥)
గక్కనఁ దా గూడఁగాను కాదు గూడ దంటినా
ముక్కు మోవ సాగి లెల మొక్కీనె తాను
యెక్కువ శ్రీవెంకటేశుఁ డెననెఁ దా నన్ను నిట్టె
పెక్కు సతులతోననె పెద్ద సేసీఁ దాను
(||pallavi||)
rammanam̐gām̐ danado ne rā naṁṭinā
simmusu niṁta priyamu sĕppa nelĕ nāgu
(||rammanagā||)
vĕllavirim̐ danamām̐ṭa vina naidinā nenu
sĕllam̐bo nā kela seva sesīni tānu
yĕllavārim̐ dā nelī nĕvvarim̐ boludu nenu
ballidum̐ḍu nā kela bām̐ti paḍīm̐ dānū
(||rammanagā||)
sĕppina ṭṭĕllā nenu seyaguṁḍedānanā
appaḍi lega lem̐ṭigi naṁpīnĕ tānu
kappurabu paḍigala kāṁtalu gāsuguṁḍam̐gā
vippusu nāgum̐gā nela vegiṁchenĕ tānū
(||rammanagā||)
gakkanam̐ dā gūḍam̐gānu kādu gūḍa daṁṭinā
mukku mova sāgi lĕla mŏkkīnĕ tānu
yĕkkuva śhrīvĕṁkaḍeśhum̐ ḍĕnanĕm̐ dā nannu niṭṭĕ
pĕkku saduladonanĕ pĕdda sesīm̐ dānu