(॥పల్లవి॥)
రంగ రంగ రంగపతి రంగనాథా - నీ
సింగారాలే తఱచాయ శ్రీరంగనాథా
(॥రంగ॥)
యేపొద్దుఁ బవ్వళంచి యింతులబోగము నీకు
రాఁపు గొలు వెప్పు డోయి రంగనాథ
పాఁపసెజ్జవిూఁదనుండి పచ్చివిరహము నీకు
పో పో వయ్యాళి యెప్పుడో రంగనాథా
(॥రంగ॥)
తతి నేడుగోటలలో తగు సన్నలే నీకు
రతి జలకే లెప్పుడు రంగనాథ
కుతిలపు నగరిలో కుంటెనమాటలే నీకు
హితవై వీదివసంత మెన్నడో రంగనాథ
(॥రంగ॥)
కోనేటిరంగమున కాంతపై పాదాలు చాఁచి
రావు పో వెక్కడికిని రంగనాథ
శ్రీవేంకటాద్రివిూఁద చేకొని నిల్చితివి
యేవేళ చూచిన నీవే యిటు రంగనాథా
(||pallavi||)
raṁga raṁga raṁgabadi raṁganāthā - nī
siṁgārāle taṟasāya śhrīraṁganāthā
(||raṁga||)
yebŏddum̐ bavvaḽaṁchi yiṁtulabogamu nīgu
rām̐pu gŏlu vĕppu ḍoyi raṁganātha
pām̐pasĕjjaviూm̐danuṁḍi pachchivirahamu nīgu
po po vayyāḽi yĕppuḍo raṁganāthā
(||raṁga||)
tadi neḍugoḍalalo tagu sannale nīgu
radi jalage lĕppuḍu raṁganātha
kudilabu nagarilo kuṁṭĕnamāḍale nīgu
hidavai vīdivasaṁta mĕnnaḍo raṁganātha
(||raṁga||)
koneḍiraṁgamuna kāṁtabai pādālu sām̐si
rāvu po vĕkkaḍigini raṁganātha
śhrīveṁkaḍādriviూm̐da segŏni nilsidivi
yeveḽa sūsina nīve yiḍu raṁganāthā