(॥పల్లవి॥)
రంగ రంగ రంగపతి రంగనాథ - నీ
సింగారాలే తఱవాయ శ్రీరంగనాథ
(॥రంగ॥)
పట్ట్టిపగలే మాతోఁ బలచఁగా నవ్వేవు
వొట్టు లేల పెట్టుకొనే వో రంగనాథ
వట్టిమాకు లిగిరించు వడి నీ మాటలు వింటే
ఱట్టిడి వీమేర మీఱకు రంగనాథ
(॥రంగ॥)
చేతులు చాఁచేవు నీవు చేరి నా చన్నులమీఁద
రాతిరి మాయింటికి రా రంగనాథ
యీతల నీ నవ్వులకే యిక్కువలు గరఁగితి
బూతులఁ దిట్టకుమీ పోపో రంగనాథ
(॥రంగ॥)
కావేరీరంగమున కాంతపై పాదాలు చాఁచి
రావు పోవు యెక్కడికోయి రంగనాథ
శ్రీవేంకటాద్రిమీఁద చేరి నన్నుఁ గూడితివి
యేవలచచిన నీవే యిటు రంగనాథ
(||pallavi||)
raṁga raṁga raṁgabadi raṁganātha - nī
siṁgārāle taṟavāya śhrīraṁganātha
(||raṁga||)
paṭṭṭibagale mādom̐ balasam̐gā navvevu
vŏṭṭu lela pĕṭṭugŏne vo raṁganātha
vaṭṭimāgu ligiriṁchu vaḍi nī māḍalu viṁṭe
ṟaṭṭiḍi vīmera mīṟagu raṁganātha
(||raṁga||)
sedulu sām̐sevu nīvu seri nā sannulamīm̐da
rādiri māyiṁṭigi rā raṁganātha
yīdala nī navvulage yikkuvalu garam̐gidi
būdulam̐ diṭṭagumī pobo raṁganātha
(||raṁga||)
kāverīraṁgamuna kāṁtabai pādālu sām̐si
rāvu povu yĕkkaḍigoyi raṁganātha
śhrīveṁkaḍādrimīm̐da seri nannum̐ gūḍidivi
yevalasasina nīve yiḍu raṁganātha