రమణునికడ కేఁగి రతి సలుపఁగరాదా
(॥పల్లవి॥)
రమణునికడ కేఁగి రతి సలుపఁగరాదా
అమరవు మీకు మీకు నలుక లింకేలే
(॥రమ॥)
చిత్తజునికే తగు శివునికే తగుఁగాక
యిత్తల మతిలో మంట యింతి నీకేలే
పొత్తుల పాముకుఁ దగు పొంచి నీలాహికిఁ దగు
మొత్తపునిట్టూర్పుగాలి ముదిత నీకేలే
(॥రమ॥)
జక్కవలకే తగు చందురునికే తగు
నిక్కి పొద్దొకలాగులు నేఁడిది యేలే
చక్కఁదేంట్లకే తగు సంపెంగలకే తగు
చొక్కులకొప్పు చెదరు సుదతి ఇంకేలే
(॥రమ॥)
మోవిపండ్లకే తగు మొనచిలుకకుఁ దగు
యీవల నీమోవిగంటి యిప్పుడే యేలే
శ్రీవేంకటేశ్వరుఁడు చింతదీర నిన్నుఁ గూడె
భావము లొక్కటాయఁ బదర నింకేలే
(||pallavi||)
ramaṇunigaḍa kem̐gi radi salubam̐garādā
amaravu mīgu mīgu naluga liṁkele
(||rama||)
sittajunige tagu śhivunige tagum̐gāga
yittala madilo maṁṭa yiṁti nīgele
pŏttula pāmugum̐ dagu pŏṁchi nīlāhigim̐ dagu
mŏttabuniṭṭūrbugāli mudida nīgele
(||rama||)
jakkavalage tagu saṁdurunige tagu
nikki pŏddŏgalāgulu nem̐ḍidi yele
sakkam̐deṁṭlage tagu saṁpĕṁgalage tagu
sŏkkulagŏppu sĕdaru sudadi iṁkele
(||rama||)
movibaṁḍlage tagu mŏnasilugagum̐ dagu
yīvala nīmovigaṁṭi yippuḍe yele
śhrīveṁkaḍeśhvarum̐ḍu siṁtadīra ninnum̐ gūḍĕ
bhāvamu lŏkkaḍāyam̐ badara niṁkele