Ramanunidodane raajasamellaam joobevu

రమణునితోడనే రాజసమెల్లాఁ జూపేవు
Language

(॥పల్లవి॥)
రమణునితోడనే రాజసమెల్లాఁ జూపేవు
సముకాననే వలపు చల్లవద్దా నీవును

(॥రమ॥)
గద్దరిచూపులు చూచి కాఁకాలేల సేసేవు
అద్దుకొని పతి కిచ్చకా లాడరాదా
పెద్దరికాన నాతఁడు ప్రియములు చెప్పఁగాను
సుద్దుల మంచితనము చూపవద్దా నీవును

(॥రమ॥)
వెక్కసపు నవ్వు నవ్వి వెంగెము లేలాడేవు
చెక్కునొక్కి కడుఁబొందు సేయరాదా
చక్కఁదనాల నతఁడు చనవులు మెరయఁగా
ఇక్కువైనమోవితేనెఇయ్యవద్దా నీవునుమర

(॥రమ॥)
ఆరీతిఁ బంతములాడి ఆనలేల పెట్టేవు
తారుకానగా రతులఁ దనుపరాదా
యీరీతి శ్రీవేంకటేశుఁ డెనసె విన్నింతలోనె
మేరమీర కిపుడిట్టె మెచ్చవద్దా నీవును

(||pallavi||)
ramaṇunidoḍane rājasamĕllām̐ jūbevu
samugānane valabu sallavaddā nīvunu

(||rama||)
gaddarisūbulu sūsi kām̐kālela sesevu
addugŏni padi kichchagā lāḍarādā
pĕddarigāna nādam̐ḍu priyamulu sĕppam̐gānu
suddula maṁchidanamu sūbavaddā nīvunu

(||rama||)
vĕkkasabu navvu navvi vĕṁgĕmu lelāḍevu
sĕkkunŏkki kaḍum̐bŏṁdu seyarādā
sakkam̐danāla nadam̐ḍu sanavulu mĕrayam̐gā
ikkuvainamovidenĕiyyavaddā nīvunumara

(||rama||)
ārīdim̐ baṁtamulāḍi ānalela pĕṭṭevu
tārugānagā radulam̐ danubarādā
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ vinniṁtalonĕ
meramīra kibuḍiṭṭĕ mĕchchavaddā nīvunu