Ramanuni kada kidu raavammaa

రమణుని కడ కిటు రావమ్మా
Language

(॥పల్లవి॥)
రమణుని కడ కిటు రావమ్మా
జమళి ముచ్చటలు చవులై నిలిచె

(॥రమ॥)
కొత్తకోరికలు కొనలు సాగఁగా
చిత్తము నిండెను సిగ్గెల్లా
పొత్తులవలపులు పోగువోయఁగా
హత్తినపులకలు అంగము నిండె

(॥రమ॥)
తొక్కినతమకము దొంతుల నుండఁగ
ముక్కున నూర్పుల ముసరుకొనె
చిక్కనినవ్వులు సెలవులఁ దొలఁకఁగ
చొక్కపుచెమటలు సోనలు గురిసె

(॥రమ॥)
కందువైనరతి కాఁగిట నుండఁగ
విందులనెమ్మోము వికసించె
యిందె శ్రీవేంకటేశుఁడు గలసెను
అంది మోవితేనియలు దయివారె

(||pallavi||)
ramaṇuni kaḍa kiḍu rāvammā
jamaḽi muchchaḍalu savulai nilisĕ

(||rama||)
kŏttagorigalu kŏnalu sāgam̐gā
sittamu niṁḍĕnu siggĕllā
pŏttulavalabulu poguvoyam̐gā
hattinabulagalu aṁgamu niṁḍĕ

(||rama||)
tŏkkinadamagamu dŏṁtula nuṁḍam̐ga
mukkuna nūrbula musarugŏnĕ
sikkaninavvulu sĕlavulam̐ dŏlam̐kam̐ga
sŏkkabusĕmaḍalu sonalu gurisĕ

(||rama||)
kaṁduvainaradi kām̐giḍa nuṁḍam̐ga
viṁdulanĕmmomu vigasiṁchĕ
yiṁdĕ śhrīveṁkaḍeśhum̐ḍu galasĕnu
aṁdi movideniyalu dayivārĕ