రమణుఁడు వీఁడివో రాతిరి యీడ నున్నాఁడు
(॥పల్లవి॥)
రమణుఁడు వీఁడివో రాతిరి యీడ నున్నాఁడు
సముకాన నుండవే చలము వాసీని
(॥రమ॥)
మంతనమాడవే చాలు మనసు నీకుఁ గరఁగీ
చెంతల నేమెల్లా బుద్దిచెప్పనేల
పంతములాడవే చాలు పతితోడ నదే మించి
యింతి నీకు మచ్చుమందయ్యీ నదే నేఁడు
(॥రమ॥)
కొచ్చి చూడవే చాలు కోపము తానె పోయీని
వచ్చి వచ్చి నేము నిన్ను వద్దననేల
పచ్చిగాఁ దిట్టవే చాలు పైకొని యదే నీకు
తచ్చి వలపులవల్లెతాళ్లయ్యీ నిపుడు
(॥రమ॥)
విడెమియ్య వే చాలు వేడుక తానే పుట్టీని
కూడుమని నేము నిన్నుఁ గొసరనేల
యీడుగా శ్రీవేంకటేశుఁ డెనసె నీకు నిదె
వాడికరతులకును వాఁటమయ్యీ నికను
(||pallavi||)
ramaṇum̐ḍu vīm̐ḍivo rādiri yīḍa nunnām̐ḍu
samugāna nuṁḍave salamu vāsīni
(||rama||)
maṁtanamāḍave sālu manasu nīgum̐ garam̐gī
sĕṁtala nemĕllā buddisĕppanela
paṁtamulāḍave sālu padidoḍa nade miṁchi
yiṁti nīgu machchumaṁdayyī nade nem̐ḍu
(||rama||)
kŏchchi sūḍave sālu kobamu tānĕ poyīni
vachchi vachchi nemu ninnu vaddananela
pachchigām̐ diṭṭave sālu paigŏni yade nīgu
tachchi valabulavallĕdāḽlayyī nibuḍu
(||rama||)
viḍĕmiyya ve sālu veḍuga tāne puṭṭīni
kūḍumani nemu ninnum̐ gŏsaranela
yīḍugā śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ nīgu nidĕ
vāḍigaradulagunu vām̐ṭamayyī niganu