రమణుఁడు చూచుఁగాని రమ్మనరె యీవేళ
(॥పల్లవి॥)
రమణుఁడు చూచుఁగాని రమ్మనరె యీవేళ
తమితో నిట్టే దయ దలఁచుమీ యనరే
(॥రమ॥)
వదన చందురునిపై వాసన కస్తూరి బొట్టు
చెదరుచున్నది చూడరే చెలులాల
పదరి రాహువు దన్నుఁ బట్టినట్టి పగదీర
పదిలాన తా మగుడఁ బట్టిన యట్లుండె
(॥రమ॥)
చల్లఁగాఁ జెలి చెక్కులఁ జల్లిన కప్పురధూళి
జల్లన రాలీఁ జూడరే సతులాల
కొల్లలుగా నయనచకోరములు వెన్నెలలు
వొల్లనె తనిసి వెళ్ళను మిసినట్లుండె
(॥రమ॥)
తుమ్మిఁద గుంపువంటి తొయ్యలినెరుల రాలె
కమ్మవిరులు చూడరే కాంతలాల
కొమ్మ శ్రీ వేంకటేశునిఁ గూడిన రతికి మెచ్చి
తమ్ముఁదామె నిండు వసంతమాడినట్లుండె
(||pallavi||)
ramaṇum̐ḍu sūsum̐gāni rammanarĕ yīveḽa
tamido niṭṭe daya dalam̐sumī yanare
(||rama||)
vadana saṁdurunibai vāsana kastūri bŏṭṭu
sĕdarusunnadi sūḍare sĕlulāla
padari rāhuvu dannum̐ baṭṭinaṭṭi pagadīra
padilāna tā maguḍam̐ baṭṭina yaṭluṁḍĕ
(||rama||)
sallam̐gām̐ jĕli sĕkkulam̐ jallina kappuradhūḽi
jallana rālīm̐ jūḍare sadulāla
kŏllalugā nayanasagoramulu vĕnnĕlalu
vŏllanĕ tanisi vĕḽḽanu misinaṭluṁḍĕ
(||rama||)
tummim̐da guṁpuvaṁṭi tŏyyalinĕrula rālĕ
kammavirulu sūḍare kāṁtalāla
kŏmma śhrī veṁkaḍeśhunim̐ gūḍina radigi mĕchchi
tammum̐dāmĕ niṁḍu vasaṁtamāḍinaṭluṁḍĕ