రమణుఁడు పిలిచీని రావే చెలియ నీవు
(॥పల్లవి॥)
రమణుఁడు పిలిచీని రావే చెలియ నీవు
తమకమే వలెఁగాక తరుణులకు
(॥రమ॥)
తలఁపుకొలంది మంచితనమే వలెఁగాక
చలపాదితనమేల సరసులకు
వెలలేని మాటల వినయమే వలెఁగాక
సొలపువెంగెములేల సుగుణలకు
(॥రమ॥)
కోటీసేయ వలపులు కుమ్మరించవలెఁగాక
నీటుతో గర్వములేల నేర్పరులకు
మేటిసరసములాడి మెఱయఁగవలెఁగాక
జూటుందనములేంటికి సొంపుదొరలకును
(॥రమ॥)
నయగారితనమున నవ్వు నవ్వవలెఁగాక
రయమున దాంగనేల రసికులకు
నియతి నన్నేలినాఁడు నేఁడు శ్రీవేంకటేశుఁడు
క్రియతో వేసరనేల కిమ్ముల దేవుళ్లకు
(||pallavi||)
ramaṇum̐ḍu pilisīni rāve sĕliya nīvu
tamagame valĕm̐gāga taruṇulagu
(||rama||)
talam̐pugŏlaṁdi maṁchidaname valĕm̐gāga
salabādidanamela sarasulagu
vĕlaleni māḍala vinayame valĕm̐gāga
sŏlabuvĕṁgĕmulela suguṇalagu
(||rama||)
koḍīseya valabulu kummariṁchavalĕm̐gāga
nīḍudo garvamulela nerbarulagu
meḍisarasamulāḍi mĕṟayam̐gavalĕm̐gāga
jūḍuṁdanamuleṁṭigi sŏṁpudŏralagunu
(||rama||)
nayagāridanamuna navvu navvavalĕm̐gāga
rayamuna dāṁganela rasigulagu
niyadi nannelinām̐ḍu nem̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu
kriyado vesaranela kimmula devuḽlagu