Ramanumdu nannu nemta ravvaseseene

రమణుఁడు నన్ను నెంత రవ్వచేసీనే
Language

(॥పల్లవి॥)
రమణుఁడు నన్ను నెంత రవ్వచేసీనే
అమరఁగఁ జెలులాల అట్టె విన్నవించరే

(॥రమ॥)
సరసమాడితేనేమి సంగడి నుండితేనేమి
గరిమఁ గూడినట్ల కాంక్షఁ దీరీనా
సరులు దిద్దితేనేమి సన్నలు చేసితేనేమి
అరిదిఁ బెండ్లాడినట్లు అక్కర వాసీనా

(॥రమ॥)
పయ్యద ముట్టితేనేమి భావించి చూచితేనేమి
తియ్యని మో విచ్చినట్టు దిష్టమయ్యీనా
వొయ్యనే నవ్వితేనేమి వొడివట్టితేనేమి
ఇయ్యెడఁ గాఁగిలించిన ట్టిచ్చకమయ్యీనా

(॥రమ॥)
పొత్తుకు వచ్చితేనేమి పూవుల వేసితేనేమి
హత్తి వినోదించిన ట్లందమయ్యీనా
ఇత్తల శ్రీ వేంకటేశుఁ డేలీ నన్ను నిట్లానే
బత్తిసేసీ నిఁకఁ దనుఁ బంగించవచ్చీనా

(||pallavi||)
ramaṇum̐ḍu nannu nĕṁta ravvasesīne
amaram̐gam̐ jĕlulāla aṭṭĕ vinnaviṁchare

(||rama||)
sarasamāḍidenemi saṁgaḍi nuṁḍidenemi
garimam̐ gūḍinaṭla kāṁkṣham̐ dīrīnā
sarulu diddidenemi sannalu sesidenemi
aridim̐ bĕṁḍlāḍinaṭlu akkara vāsīnā

(||rama||)
payyada muṭṭidenemi bhāviṁchi sūsidenemi
tiyyani mo vichchinaṭṭu diṣhṭamayyīnā
vŏyyane navvidenemi vŏḍivaṭṭidenemi
iyyĕḍam̐ gām̐giliṁchina ṭṭichchagamayyīnā

(||rama||)
pŏttugu vachchidenemi pūvula vesidenemi
hatti vinodiṁchina ṭlaṁdamayyīnā
ittala śhrī veṁkaḍeśhum̐ ḍelī nannu niṭlāne
battisesī nim̐kam̐ danum̐ baṁgiṁchavachchīnā