Ramanumdu naagum daanu ramani nenu

రమణుఁడు నాకుఁ దాను రమణి నేను
Language

(॥పల్లవి॥)
రమణుఁడు నాకుఁ దాను రమణి నేను
అమరఁగ నెందాఁకా నాసవెట్టీఁ దాను

(॥॥)
సెలవికి నవ్వుహెచ్చె చెక్కిటికిఁ జేయి వచ్చె
యెలమి నమ్మికలిచ్చీ నెందాఁకాఁ దాను
పులకలు మేన నిక్కె బుసకొట్టులివె దక్కె
పొలుపు మిగుల నెంత బుజ్జగించీఁ దాను

(॥॥)
చిత్తములోఁ జింత నిండె సిగ్గులు మోమునఁ బండె
యిత్తల నొడఁబరచీ నెందాఁకాఁ దాను
బత్తికోరికెలఁ దొట్టె పలుకులు మోవిఁబుట్టె
కొత్తలుగా వలపెంత గురిసేసీఁ దాను

(॥॥)
కన్నులఁ దేటలు వారె కాఁగిటఁ దగవు దేరె
యెన్నేసి వేసాలు సేసీ నెందాఁకాఁ దాను
అన్నిటా శ్రీవేంకటేశుఁ డట్టే తానె నన్ను నేలె
మన్ననల నన్ను నెంత మరగించీఁ దాను

(||pallavi||)
ramaṇum̐ḍu nāgum̐ dānu ramaṇi nenu
amaram̐ga nĕṁdām̐kā nāsavĕṭṭīm̐ dānu

(||||)
sĕlavigi navvuhĕchchĕ sĕkkiḍigim̐ jeyi vachchĕ
yĕlami nammigalichchī nĕṁdām̐kām̐ dānu
pulagalu mena nikkĕ busagŏṭṭulivĕ dakkĕ
pŏlubu migula nĕṁta bujjagiṁchīm̐ dānu

(||||)
sittamulom̐ jiṁta niṁḍĕ siggulu momunam̐ baṁḍĕ
yittala nŏḍam̐barasī nĕṁdām̐kām̐ dānu
battigorigĕlam̐ dŏṭṭĕ palugulu movim̐buṭṭĕ
kŏttalugā valabĕṁta gurisesīm̐ dānu

(||||)
kannulam̐ deḍalu vārĕ kām̐giḍam̐ dagavu derĕ
yĕnnesi vesālu sesī nĕṁdām̐kām̐ dānu
anniḍā śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭe tānĕ nannu nelĕ
mannanala nannu nĕṁta maragiṁchīm̐ dānu