Ramanumdu mammela ravvaseseene

రమణుఁడు మమ్మేల రవ్వసేసీనే
Language

(॥పల్లవి॥)
రమణుఁడు మమ్మేల రవ్వసేసీనే
సముకాన నుండితేనే చవిపుట్టీనా

(॥రమ॥)
బలిమిసేసి యెంత పలుమాయ నవ్వినాను
వలపు గలంతేకాక వచ్చేదేమి
చలపట్టి యెన్నేసిసరసము లాడినాను
పిలువని పేరటము ప్రియమయ్వీనా

(॥రమ॥)
తతిగొని యెంత మొక్కి తమితోడఁ బెనఁగినా
యితవు కొలఁదేకాక యొక్కుడున్న దా
నుతికెక్క నెన్నేసికానుకలు చేతికిచ్చినా
అతిరాజసమెకాక అంకెకు వచ్చీనా

(॥రమ॥)
వేడుకతో నొడివట్టి వేమారుఁదీసినాను
వాడికగల ట్టెకాక వసమయ్యీనా
యీడనె శ్రీవేంకటేశు డేలె నింతలోనె నన్ను
వీడనిపొందులు మరివెగటయ్యీనా

(||pallavi||)
ramaṇum̐ḍu mammela ravvasesīne
samugāna nuṁḍidene savibuṭṭīnā

(||rama||)
balimisesi yĕṁta palumāya navvinānu
valabu galaṁtegāga vachchedemi
salabaṭṭi yĕnnesisarasamu lāḍinānu
piluvani peraḍamu priyamayvīnā

(||rama||)
tadigŏni yĕṁta mŏkki tamidoḍam̐ bĕnam̐ginā
yidavu kŏlam̐degāga yŏkkuḍunna dā
nudigĕkka nĕnnesigānugalu sedigichchinā
adirājasamĕgāga aṁkĕgu vachchīnā

(||rama||)
veḍugado nŏḍivaṭṭi vemārum̐dīsinānu
vāḍigagala ṭṭĕgāga vasamayyīnā
yīḍanĕ śhrīveṁkaḍeśhu ḍelĕ niṁtalonĕ nannu
vīḍanibŏṁdulu marivĕgaḍayyīnā