రమణుఁడు దానైన రవ్వే నాకుఁ జాలు
(॥పల్లవి॥)
రమణుఁడు దానైన రవ్వే నాకుఁ జాలు
భ్రమగాని తనివోని పంతమే చాలు
(॥రమ॥)
ఆడుకోలుమాటలు తా నాడనీ మాననీ నే -
నాడినమాటల కోర్చె నంతే చాలు
వాడుచుఁ దా నవ్వనీ నవ్వకమాననీ ఇఁక
యీడ నాచేఁతల కోర్చె నిదియో చాలును
(॥రమ॥)
పెన్నిధిఁ బానుపునకుఁ బిలువనీ మాననీ నే
సన్న సేసితేఁ దెలిసేసరవే చాలు
మన్నించి మాటాడనీ మాటాడకుండనీలే నేఁ
గన్నులఁ జూచినమెచ్చేఘనతే చాలును
(॥రమ॥)
ఆఁగి నాకు వలవనీ అటుగాక మాననీ
కాఁగిట నన్నుఁగూడినకతలే చాలు
ఆగతి శ్రీవేంకటేశుఁ డలమేలుమంగ నేను
యీగతి నేకములైతి మిదియే చాలును
(||pallavi||)
ramaṇum̐ḍu dānaina ravve nāgum̐ jālu
bhramagāni tanivoni paṁtame sālu
(||rama||)
āḍugolumāḍalu tā nāḍanī mānanī ne -
nāḍinamāḍala korsĕ naṁte sālu
vāḍusum̐ dā navvanī navvagamānanī im̐ka
yīḍa nāsem̐tala korsĕ nidiyo sālunu
(||rama||)
pĕnnidhim̐ bānubunagum̐ biluvanī mānanī ne
sanna sesidem̐ dĕlisesarave sālu
manniṁchi māḍāḍanī māḍāḍaguṁḍanīle nem̐
gannulam̐ jūsinamĕchcheghanade sālunu
(||rama||)
ām̐gi nāgu valavanī aḍugāga mānanī
kām̐giḍa nannum̐gūḍinagadale sālu
āgadi śhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁga nenu
yīgadi negamulaidi midiye sālunu