Ramanumdavu neevu ramani nenu

రమణుఁడవు నీవు రమణి నేను
Language

(॥పల్లవి॥)
రమణుఁడవు నీవు రమణి నేను
తమితోడ నీవు నాకు దక్కివుండవయ్యా

(॥॥)
తలఁచి నీవె నన్ను దయఁజూచుట గాక
చెలరేఁగి విన్నపాలు సేసేదాననా
నెలకొన్నబుద్ది నీవే నేరువు టింతేకాక
చలపట్టి నీతోను సాము సేసేదాననా

(॥॥)
మంతనానఁ జనవిచ్చి మన్నించుట గాక
చెంతల చుట్టరికము చెప్పేదాననా
వంతులకు నీవె నాపై వలపు చల్లుట కాక
పంతాననిన్నుఁ జెనకి పచరించేదాననా

(॥॥)
నిక్కముగా నన్ను నేలి నీవు మెచ్చుట గాక
చెక్కునొక్కి యెమ్మె మెరసేటిదాననా
యిక్కువ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
మొక్కేదానఁ గాక నీతో మొనచూపేదాననా

(||pallavi||)
ramaṇum̐ḍavu nīvu ramaṇi nenu
tamidoḍa nīvu nāgu dakkivuṁḍavayyā

(||||)
talam̐si nīvĕ nannu dayam̐jūsuḍa gāga
sĕlarem̐gi vinnabālu sesedānanā
nĕlagŏnnabuddi nīve neruvu ṭiṁtegāga
salabaṭṭi nīdonu sāmu sesedānanā

(||||)
maṁtanānam̐ janavichchi manniṁchuḍa gāga
sĕṁtala suṭṭarigamu sĕppedānanā
vaṁtulagu nīvĕ nābai valabu salluḍa kāga
paṁtānaninnum̐ jĕnagi pasariṁchedānanā

(||||)
nikkamugā nannu neli nīvu mĕchchuḍa gāga
sĕkkunŏkki yĕmmĕ mĕraseḍidānanā
yikkuva śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
mŏkkedānam̐ gāga nīdo mŏnasūbedānanā