రమణుఁడ చిత్తగించు రతికెక్కె నీదేవులు
(॥పల్లవి॥)
రమణుఁడ చిత్తగించు రతికెక్కె నీదేవులు
సముకపు మాటలు సమ్మదములాయను
(॥॥)
అదే నీచక్కఁదనాన కద్దము చూపినట్టు
పొదిగొని మెరసీని పొలఁతి మోము
కదిసి నీలాల బంతి కానుకగాఁ బట్టినట్టు
యెదుట నీకెతురుము యెక్కుడై కాన్పించెను
(॥॥)
బడి నీ సింగారానకు పైఁడికుండ లెత్తినట్టు
కడుమించీ నివిగో కాంత గుబ్బలు
వెడ నీకోరికలు తీవెలు వారి వుండినట్టు
కడిఁగి యీకె చేతులు కనుపట్టి వున్నవి
(॥॥)
చుట్టుగా నీవలపు రాసులుగాఁ బోసిన యట్టు
వొట్టి యీకె పిరుఁదులు వొనరినవి
యిట్టె శ్రీవేంకటేశ యీకెతో ననిచినట్టు
జట్టిగా నీమెపాదాల జంట చిగురున్నది
(||pallavi||)
ramaṇum̐ḍa sittagiṁchu radigĕkkĕ nīdevulu
samugabu māḍalu sammadamulāyanu
(||||)
ade nīsakkam̐danāna kaddamu sūbinaṭṭu
pŏdigŏni mĕrasīni pŏlam̐ti momu
kadisi nīlāla baṁti kānugagām̐ baṭṭinaṭṭu
yĕduḍa nīgĕdurumu yĕkkuḍai kānpiṁchĕnu
(||||)
baḍi nī siṁgārānagu paim̐ḍiguṁḍa lĕttinaṭṭu
kaḍumiṁchī nivigo kāṁta gubbalu
vĕḍa nīgorigalu tīvĕlu vāri vuṁḍinaṭṭu
kaḍim̐gi yīgĕ sedulu kanubaṭṭi vunnavi
(||||)
suṭṭugā nīvalabu rāsulugām̐ bosina yaṭṭu
vŏṭṭi yīgĕ pirum̐dulu vŏnarinavi
yiṭṭĕ śhrīveṁkaḍeśha yīgĕdo nanisinaṭṭu
jaṭṭigā nīmĕbādāla jaṁṭa sigurunnadi