Ramanumda seppamaa ramani nee yedanu

రమణుఁడ చెప్పమా రమణి నీ యెడను
Language

(॥పల్లవి॥)
రమణుఁడ చెప్పమా రమణి నీ యెడను
జమళి రెండొకటఁ జల్లీ వలపు

(॥రమ॥)
మోతుగు వూచెనో మొల్ల వూచెనో
కాతరపుచెలి కన్నులను
చూతము వూచెనో సురవొన్న వూచెనో
ఘాతల నీసతికాయమున

(॥రమ॥)
పగడము వండెనో పై మోవి పండెనో
అగపడి యీకాంత అధరమున
పొగరునిమ్మలో పోకలు వండెనో
మగువ కిదివో నెమ్మదిఁ జన్నులను

(॥రమ॥)
తమలపుఁ జిగురో దాడిమచిగురో
అమరెఁ గరములనె అంగనకు
చెమటలఁ గూడితి శ్రీవేంకటేశ్వర
సమరతి మీ యిచ్చలు చిగిరించె

(||pallavi||)
ramaṇum̐ḍa sĕppamā ramaṇi nī yĕḍanu
jamaḽi rĕṁḍŏgaḍam̐ jallī valabu

(||rama||)
modugu vūsĕno mŏlla vūsĕno
kādarabusĕli kannulanu
sūdamu vūsĕno suravŏnna vūsĕno
ghādala nīsadigāyamuna

(||rama||)
pagaḍamu vaṁḍĕno pai movi paṁḍĕno
agabaḍi yīgāṁta adharamuna
pŏgarunimmalo pogalu vaṁḍĕno
maguva kidivo nĕmmadim̐ jannulanu

(||rama||)
tamalabum̐ jiguro dāḍimasiguro
amarĕm̐ garamulanĕ aṁganagu
sĕmaḍalam̐ gūḍidi śhrīveṁkaḍeśhvara
samaradi mī yichchalu sigiriṁchĕ