(॥పల్లవి॥)
రమణుఁడ నీమై రచన లివి
చెమటల చెలియకు చెలువాయ
(॥రమ॥)
తరుణికి నీపైఁ దప్పులు వెదకఁగ
సరసపుమాటలు చవులాయ
విరహపుఁదరుణికి వెన్నెలమోమే
పరితాపపువైభవ మాయె
(॥రమ॥)
సుదతి నిన్నుఁ గని సొలపులు సొలయఁగ
ముదితకు నవ్వులమోమాయ
కదలే తురుమునఁ గాంత నడవఁగా
కుదురుఁ గుచములకుఁ గులుకాయ
(॥రమ॥)
చెలి నిను గోళ్లఁ జెక్కు నొక్కఁగా
తెలి నునుమోవికిఁ దీపాయె
వెలఁది కిపుడు శ్రీవేంకటేశ్వరుండ
అలుకలు దీరఁగ ననువాయె
(||pallavi||)
ramaṇum̐ḍa nīmai rasana livi
sĕmaḍala sĕliyagu sĕluvāya
(||rama||)
taruṇigi nībaim̐ dappulu vĕdagam̐ga
sarasabumāḍalu savulāya
virahabum̐daruṇigi vĕnnĕlamome
paridābabuvaibhava māyĕ
(||rama||)
sudadi ninnum̐ gani sŏlabulu sŏlayam̐ga
mudidagu navvulamomāya
kadale turumunam̐ gāṁta naḍavam̐gā
kudurum̐ gusamulagum̐ gulugāya
(||rama||)
sĕli ninu goḽlam̐ jĕkku nŏkkam̐gā
tĕli nunumovigim̐ dībāyĕ
vĕlam̐di kibuḍu śhrīveṁkaḍeśhvaruṁḍa
alugalu dīram̐ga nanuvāyĕ