(॥పల్లవి॥)
రమణుఁడ ఇంతట రారాదా
సమరతిఁ దేరీ జగడము లిఁకను
(॥రమ॥)
కోవిలతిట్లగొణఁగుల చేతను
తావులు దప్పెను ధైర్యములు
మావుల చిలుకలమాటవెంగెముల
వావులుమాలెను వలపులు చెలికి
(॥రమ॥)
కొంచెవువాయువుకుంటెనతనముల
చంచల మందెను సతిమనసూ
పంచలతుమ్మిదబలములపొంచుల
యించుకించుకే యెక్కెను చలము
(॥రమ॥)
విరులశరంబులవేండ్లవాండ్ల
మరులునుఁ దెలువులు మగువకును
యిరవుగ శ్రీవేంకటేశ కూడితివి
సరసపుమాఁటలు సాగెను కొనకు
(||pallavi||)
ramaṇum̐ḍa iṁtaḍa rārādā
samaradim̐ derī jagaḍamu lim̐kanu
(||rama||)
koviladiṭlagŏṇam̐gula sedanu
tāvulu dappĕnu dhairyamulu
māvula silugalamāḍavĕṁgĕmula
vāvulumālĕnu valabulu sĕligi
(||rama||)
kŏṁchĕvuvāyuvuguṁṭĕnadanamula
saṁchala maṁdĕnu sadimanasū
paṁchaladummidabalamulabŏṁchula
yiṁchugiṁchuge yĕkkĕnu salamu
(||rama||)
virulaśharaṁbulaveṁḍlavāṁḍla
marulunum̐ dĕluvulu maguvagunu
yiravuga śhrīveṁkaḍeśha kūḍidivi
sarasabumām̐ṭalu sāgĕnu kŏnagu