Ramanigadagu nitte raavayyaa

రమణికడకు నిట్టె రావయ్యా
Language

(॥పల్లవి॥)
రమణికడకు నిట్టె రావయ్యా
సముకాన నీకిన్ని చాటిచెప్పే నిఁకను

(॥రమ॥)
మంతనపు నీచేఁతలే మాపుదాఁకా వినివిని
కాంత చెలులతోడ కడునవ్వెను
వింతలైననీగుణాలు విచారించుకొని లోలో
చెంతలనే తలవూఁచి నేదదేరి మెచ్చెను

(॥రమ॥)
వేడుకైన నీమాటఁలే వేగినంతా నాడుకొని
జాడతోనే సారెసారె సంతసించెను
కూడిన నీకూటముల గుఱుతులు చూచుకొని
వాడుదేరి నీమీఁద వలపులు చల్లెను

(॥రమ॥)
యిక్కువై న నీరాకకు నిందాఁకా నెదురు చూచి
గక్కన నిన్నుఁ గాని కాఁగిలించెను
తక్కక శ్రీ వేంకటేశ తతి నిట్టె కూడితివి
పెక్కు భావముల నీపై ప్రియమే పెంచీవి

(||pallavi||)
ramaṇigaḍagu niṭṭĕ rāvayyā
samugāna nīginni sāḍisĕppe nim̐kanu

(||rama||)
maṁtanabu nīsem̐tale mābudām̐kā vinivini
kāṁta sĕluladoḍa kaḍunavvĕnu
viṁtalainanīguṇālu visāriṁchugŏni lolo
sĕṁtalane talavūm̐si nedaderi mĕchchĕnu

(||rama||)
veḍugaina nīmāḍam̐le veginaṁtā nāḍugŏni
jāḍadone sārĕsārĕ saṁtasiṁchĕnu
kūḍina nīgūḍamula guṟudulu sūsugŏni
vāḍuderi nīmīm̐da valabulu sallĕnu

(||rama||)
yikkuvai na nīrāgagu niṁdām̐kā nĕduru sūsi
gakkana ninnum̐ gāni kām̐giliṁchĕnu
takkaga śhrī veṁkaḍeśha tadi niṭṭĕ kūḍidivi
pĕkku bhāvamula nībai priyame pĕṁchīvi