రమణి నూరడింతువు రావయ్య నీవు
(॥పల్లవి॥)
రమణి నూరడింతువు రావయ్య నీవు
తమకించి తన్నుఁ దానె తల్లడించీ నిదివో
(॥రమణి॥)
అప్పుడు నిన్ను సొలసి యాడి యాలాడితినంటా
దప్పిదేరే మోవితోడఁ దలఁకించీఁ జెలి
కొప్పువట్టి తియ్యఁగాను గోరు నిన్నుఁ దాఁకెనంటా
అప్పటి లోలోనె వుస్సురనీ నిదివో
(॥రమణి॥)
వెంగేన నిమ్మపంటను వేసేలవేసితినంటా
కంగి మనికితపడి కరఁగీఁ జెలి
ముంగిటఁ బెనఁగఁగాను యెంగిలి మోవంటె నంటె
పొంగుఁ జెమటలతోఁ దాఁ బొగిలీనిదివో
(॥రమణి॥)
వుబ్బునఁ జనుమొనల నొత్తేల వొత్తితినంటా
అబ్బురానఁ జిన్నఁబోయి అలసీఁ జెలి
గబ్బి శ్రీ వేంకటేశుఁడ కాఁగిట నిన్నటుగూడి
గుబ్బలొత్తెనంటా నీకుఁ గొంకి మొక్కీనిదివో
(||pallavi||)
ramaṇi nūraḍiṁtuvu rāvayya nīvu
tamagiṁchi tannum̐ dānĕ tallaḍiṁchī nidivo
(||ramaṇi||)
appuḍu ninnu sŏlasi yāḍi yālāḍidinaṁṭā
dappidere movidoḍam̐ dalam̐kiṁchīm̐ jĕli
kŏppuvaṭṭi tiyyam̐gānu goru ninnum̐ dām̐kĕnaṁṭā
appaḍi lolonĕ vussuranī nidivo
(||ramaṇi||)
vĕṁgena nimmabaṁṭanu veselavesidinaṁṭā
kaṁgi manigidabaḍi karam̐gīm̐ jĕli
muṁgiḍam̐ bĕnam̐gam̐gānu yĕṁgili movaṁṭĕ naṁṭĕ
pŏṁgum̐ jĕmaḍaladom̐ dām̐ bŏgilīnidivo
(||ramaṇi||)
vubbunam̐ janumŏnala nŏttela vŏttidinaṁṭā
abburānam̐ jinnam̐boyi alasīm̐ jĕli
gabbi śhrī veṁkaḍeśhum̐ḍa kām̐giḍa ninnaḍugūḍi
gubbalŏttĕnaṁṭā nīgum̐ gŏṁki mŏkkīnidivo