Ramani javvanamu raamaraajya miga

రమణి జవ్వనము రామరాజ్య మిక
Language

(॥పల్లవి॥)
రమణి జవ్వనము రామరాజ్య మిక
అమరఁగ నిటు గొనియాడరె చెలులు

(॥రమ॥)
కాంతకుచంబుల ఘనదుర్గంబులు
కాంతి జక్కనలు గజబలిసె
పొంతనె పిఱుఁదనుపులినపుఁదిప్పలు
మంతుకెక్కె నదె మదనుఁడు బలిసె

(॥రమ॥)
సతివలయపుముఖచక్రవాక మిదె
అతికళల చంద్రుఁ డదె బలిసె
మతకముతోఁ గచమండలరాజ్యము
మితిమీరిన తుమ్మిద లిటు బలిసె

(॥రమ॥)
తరుణీరతుల బంధపుబహురాజ్యము
నిరతి శ్రీవేంకటవిధి బలిసె
ఆరయ నతనిపుర మందుకుఁ బతిగా
సిరులుమించ నీచెలియును బలిసె

(||pallavi||)
ramaṇi javvanamu rāmarājya miga
amaram̐ga niḍu gŏniyāḍarĕ sĕlulu

(||rama||)
kāṁtagusaṁbula ghanadurgaṁbulu
kāṁti jakkanalu gajabalisĕ
pŏṁtanĕ piṟum̐danubulinabum̐dippalu
maṁtugĕkkĕ nadĕ madanum̐ḍu balisĕ

(||rama||)
sadivalayabumukhasakravāga midĕ
adigaḽala saṁdrum̐ ḍadĕ balisĕ
madagamudom̐ gasamaṁḍalarājyamu
midimīrina tummida liḍu balisĕ

(||rama||)
taruṇīradula baṁdhabubahurājyamu
niradi śhrīveṁkaḍavidhi balisĕ
āraya nadanibura maṁdugum̐ badigā
sirulumiṁcha nīsĕliyunu balisĕ