Ramani guttunanumte ravvaseyanemtigi

రమణి గుట్టుననుంటే రవ్వసేయనేఁటికి
Language

(॥పల్లవి॥)
రమణి గుట్టుననుంటే రవ్వసేయనేఁటికి
మమత మాపైఁ గలితే మగుడి రారాదా

(॥రమ॥)
మొఱఁగుసిగ్గులతోడ మొలకచన్నులతోడ
మఱఁగున నుండి నీతో మాటలాడీని
చెఱఁగువట్టి యేలతీసేవు వెలుపటికి
తెఱవమనుసు నీవే తెలుసుకోరాదా

(॥రమ॥)
జమళియాసలతోడ సళుపుఁజూపులతోడ
సముకాననేనీతో సన్నసేసీని
క్రమ మెఱుఁగక యేల గరిసించే వీడ నిట్టే
తిమురుచు, యేకతానఁదెలుసుకోరాదా

(॥రమ॥)
మొగముకళలతోడ మోహపుఁజెమటలతోడ
తగిలితగిలి నిన్నుఁ దమిరేఁచీని
నగి శ్రీవేంకటాద్రిపై నన్ను నాపె నేలితివి
తెగడి గోవిందరాజ తెలుసుకోరాదా

(||pallavi||)
ramaṇi guṭṭunanuṁṭe ravvaseyanem̐ṭigi
mamada mābaim̐ galide maguḍi rārādā

(||rama||)
mŏṟam̐gusigguladoḍa mŏlagasannuladoḍa
maṟam̐guna nuṁḍi nīdo māḍalāḍīni
sĕṟam̐guvaṭṭi yeladīsevu vĕlubaḍigi
tĕṟavamanusu nīve tĕlusugorādā

(||rama||)
jamaḽiyāsaladoḍa saḽubum̐jūbuladoḍa
samugānanenīdo sannasesīni
krama mĕṟum̐gaga yela garisiṁche vīḍa niṭṭe
timurusu, yegadānam̐dĕlusugorādā

(||rama||)
mŏgamugaḽaladoḍa mohabum̐jĕmaḍaladoḍa
tagilidagili ninnum̐ damirem̐sīni
nagi śhrīveṁkaḍādribai nannu nābĕ nelidivi
tĕgaḍi goviṁdarāja tĕlusugorādā