Ramani bhaagyamu nemdu rachchalagekke

రమణి భాగ్యము నేఁడు రచ్చలకెక్కె
Language

(॥పల్లవి॥)
రమణి భాగ్యము నేఁడు రచ్చలకెక్కె
తమకపు వలపు నీ తల కేల యెక్కదో

(॥రమ॥)
చెలితలఁపులో చింత చెక్కిటిచేతికి వచ్చే
యెలమి నీచిత్తమింకా నేల రాదో
నిలువున కాఁకలెల్లా నిట్టూరుపులఁ బుట్టె
తలిరుబోఁడి పై నీకు దయ యేలపుట్టదో

(॥రమ॥)
దట్టపుఁగోరికలెల్లా తనుపులకలఁ దీరె
యిట్టె విన్నపాలఁ గతలేల తేరవో
చిట్టికపువిరహము చెమటలఁ గానవచ్చె
గట్టిగా నీమోహమేల కానరాదో

(॥రమ॥)
నిక్కుఁగుచము లింతివి నీకాఁగిటనే మించె
యెక్కువ నీసిగ్గు లిఁకనేల మించవో
ప్రక్కన శ్రీవేంకటేశ పడఁతిఁ గూడితి విట్టె
తక్కించి మన్నించ నీకుఁ దరి యెట్టాయనో

(||pallavi||)
ramaṇi bhāgyamu nem̐ḍu rachchalagĕkkĕ
tamagabu valabu nī tala kela yĕkkado

(||rama||)
sĕlidalam̐pulo siṁta sĕkkiḍisedigi vachche
yĕlami nīsittamiṁkā nela rādo
niluvuna kām̐kalĕllā niṭṭūrubulam̐ buṭṭĕ
talirubom̐ḍi pai nīgu daya yelabuṭṭado

(||rama||)
daṭṭabum̐gorigalĕllā tanubulagalam̐ dīrĕ
yiṭṭĕ vinnabālam̐ gadalela teravo
siṭṭigabuvirahamu sĕmaḍalam̐ gānavachchĕ
gaṭṭigā nīmohamela kānarādo

(||rama||)
nikkum̐gusamu liṁtivi nīgām̐giḍane miṁchĕ
yĕkkuva nīsiggu lim̐kanela miṁchavo
prakkana śhrīveṁkaḍeśha paḍam̐tim̐ gūḍidi viṭṭĕ
takkiṁchi manniṁcha nīgum̐ dari yĕṭṭāyano