Radiraajajanaga vo raamaamanohara

రతిరాజజనక వో రామామనోహర
Language

(॥పల్లవి॥)
రతిరాజజనక వో రామామనోహర
తతి తోడఁ బురుషోత్తముఁడవు నీవే

(॥॥)
సతుల మన సెఱిఁ గి సరసము లాడవలె
యితవుగాను మోవి యియ్యవలె
మతకము లెల్ల మాని మర్మము లంటఁగవలె
చతురుఁడ విన్నిటాను జాణవు నీవే

(॥॥)
భావించి చూచేవారిఁ బక్కన లాలించవలె
కైవసమై వలపులు గైకొనవలె
చేవమీఱ నవ్వు నవ్వి సిగ్గు దేరుచవలె
కోవిదుఁడ విందుకెల్లా గురువవు నీవే

(॥॥)
తొట్టి యిందరికి నీ రతులు నేరుపఁగవలె
నెట్టు కొని యేలి కృప నించఁగవలె
గట్టిగ నే నలమేల్మంగను నన్నుఁ గూడితివి
యిట్టి గుణాల శ్రీ వేంకటేశుఁ డవు నీవే.

(||pallavi||)
radirājajanaga vo rāmāmanohara
tadi toḍam̐ buruṣhottamum̐ḍavu nīve

(||||)
sadula mana sĕṟim̐ gi sarasamu lāḍavalĕ
yidavugānu movi yiyyavalĕ
madagamu lĕlla māni marmamu laṁṭam̐gavalĕ
sadurum̐ḍa vinniḍānu jāṇavu nīve

(||||)
bhāviṁchi sūsevārim̐ bakkana lāliṁchavalĕ
kaivasamai valabulu gaigŏnavalĕ
sevamīṟa navvu navvi siggu derusavalĕ
kovidum̐ḍa viṁdugĕllā guruvavu nīve

(||||)
tŏṭṭi yiṁdarigi nī radulu nerubam̐gavalĕ
nĕṭṭu kŏni yeli kṛpa niṁcham̐gavalĕ
gaṭṭiga ne nalamelmaṁganu nannum̐ gūḍidivi
yiṭṭi guṇāla śhrī veṁkaḍeśhum̐ ḍavu nīve.