Radigekkem banulu neerabamaayanu

రతికెక్కెఁ బనులు నీరపమాయను
Language

(॥పల్లవి॥)
రతికెక్కెఁ బనులు నీరపమాయను
మతకరి నీ మాటకు మారాడకుండఁగను

(॥రతి॥)
నాతో నీవునవ్వినవ్వినయగారితనాలనే
కాతరించి యంతలోనే కాఁగిలించేవు
నీతు లెఱుఁగుదువు నీనేరుపు మంచిదిగాదా
చేతికి లోనైనవారు సేవ గలుగఁగను

(॥రతి॥)
చెక్కులు మెల్లనే నొక్కి సిగ్గులెల్లా విడిపించి
మొక్కలాన దగ్గరి నామోవి యానేవు
వొక్కపొత్తు గలసె నీవోపిక మంచిదిగాదా
అక్కరతో సతులు నీయంకెకు రాఁగాను

(॥రతి॥)
బేసబెల్లి తనమున పీఁటమీఁదఁ గూచుఁడి
సేసవెట్టి పెండ్లాడి చిమ్మిరేఁచేవు
వాసితో శ్రీవేంకటేశ వైపుగ నన్నేలితివి
యీసరిత మావంటివారింపులు చల్లఁగను

(||pallavi||)
radigĕkkĕm̐ banulu nīrabamāyanu
madagari nī māḍagu mārāḍaguṁḍam̐ganu

(||radi||)
nādo nīvunavvinavvinayagāridanālane
kādariṁchi yaṁtalone kām̐giliṁchevu
nīdu lĕṟum̐guduvu nīnerubu maṁchidigādā
sedigi lonainavāru seva galugam̐ganu

(||radi||)
sĕkkulu mĕllane nŏkki siggulĕllā viḍibiṁchi
mŏkkalāna daggari nāmovi yānevu
vŏkkabŏttu galasĕ nīvobiga maṁchidigādā
akkarado sadulu nīyaṁkĕgu rām̐gānu

(||radi||)
besabĕlli tanamuna pīm̐ṭamīm̐dam̐ gūsum̐ḍi
sesavĕṭṭi pĕṁḍlāḍi simmirem̐sevu
vāsido śhrīveṁkaḍeśha vaibuga nannelidivi
yīsarida māvaṁṭivāriṁpulu sallam̐ganu