రతి నీపలుకులకు రామ నడపులకు
(॥పల్లవి॥)
రతి నీపలుకులకు రామ నడపులకు
గతిగూడఁ గడమ రాగము సేయుమీ
(॥రతి॥)
పిల్లఁగోవిరపములు బెరయించఁగా నదే
గొల్లెతలమట్టెలకుఁ గూడె సుతి
పల్లవపుఁ బద్దముల పాటలు వాడుచుఁ
గల్లగాదు కడమ రాగము సేయుమీ
(॥రతి॥)
ముందు నీసంకపురవ రమునకు గోపికలెల్ల
కుందణపు టందెలకుఁ గూడె సుతి
చిందుల రాగములు చిలికించి చిలికించి
కందువులఁ గడమ రాగము సేయుమీ
(॥రతి॥)
పెనఁగేనీవూరుపులు పెరుగమ్మేకాంతల-
కొనగోరితాఁకులకుఁ గూడె సుతి
చెనకిత విందరిని శ్రీవేంకటేశ్వర
కనుచొక్కి కడమ రాగము సేయుమీ
(||pallavi||)
radi nībalugulagu rāma naḍabulagu
gadigūḍam̐ gaḍama rāgamu seyumī
(||radi||)
pillam̐govirabamulu bĕrayiṁcham̐gā nade
gŏllĕdalamaṭṭĕlagum̐ gūḍĕ sudi
pallavabum̐ baddamula pāḍalu vāḍusum̐
gallagādu kaḍama rāgamu seyumī
(||radi||)
muṁdu nīsaṁkaburava ramunagu gobigalĕlla
kuṁdaṇabu ṭaṁdĕlagum̐ gūḍĕ sudi
siṁdula rāgamulu siligiṁchi siligiṁchi
kaṁduvulam̐ gaḍama rāgamu seyumī
(||radi||)
pĕnam̐genīvūrubulu pĕrugammegāṁtala-
kŏnagoridām̐kulagum̐ gūḍĕ sudi
sĕnagida viṁdarini śhrīveṁkaḍeśhvara
kanusŏkki kaḍama rāgamu seyumī