Rachchalu seyaga raavayyaa

రచ్చలు సేయక రావయ్యా
Language

(॥పల్లవి॥)
రచ్చలు సేయక రావయ్యా
యిచ్చ యెఱఁగ నిది యేలయ్యా

(॥రచ్చ॥)
జంకెనచూపులు సరసపుమాఁటలు
లంకెలఁ బెట్టీ లలితాంగి
మంకులవొట్లు మాయలఅలుకలు
యింకా నీపెతో నేలయ్యా

(॥రచ్చ॥)
దొంతులయాసలు దోమటిబాసలు
సంతము సేసీ జవరాలు
పంతపుబిగువులు పాయపుమదములు
యెంతకెంత మరి యేలయ్యా

(॥రచ్చ॥)
చనవులసవిగెలు చాయలసన్నలు
పెనపులఁ బెట్టి ప్రియురాలు
యెనసితి శ్రీవేంకటేశ యీపె నిదె
యినుమడిపరవశ మేలయ్యా

(||pallavi||)
rachchalu seyaga rāvayyā
yichcha yĕṟam̐ga nidi yelayyā

(||rachcha||)
jaṁkĕnasūbulu sarasabumām̐ṭalu
laṁkĕlam̐ bĕṭṭī lalidāṁgi
maṁkulavŏṭlu māyalaalugalu
yiṁkā nībĕdo nelayyā

(||rachcha||)
dŏṁtulayāsalu domaḍibāsalu
saṁtamu sesī javarālu
paṁtabubiguvulu pāyabumadamulu
yĕṁtagĕṁta mari yelayyā

(||rachcha||)
sanavulasavigĕlu sāyalasannalu
pĕnabulam̐ bĕṭṭi priyurālu
yĕnasidi śhrīveṁkaḍeśha yībĕ nidĕ
yinumaḍibaravaśha melayyā