Rachchalom benamguduraa raamala toda

రచ్చలోఁ బెనఁగుదురా రామల తోడ
Language

(॥పల్లవి॥)
రచ్చలోఁ బెనఁగుదురా రామల తోడ
యిచ్చెరిఁగి కలసితే నింతులు వలతురు

(॥రచ్చ॥)
యిక్కడనేల చెనకీ నింకి రమ్మనవే
చెక్కు నొక్కి తనసేవ చేసే నేను
మొక్కళపుఁదనమేలే మొగవాఁడైన వానికి
కక్కసించకుండితేనే కాంతలు వలతురు

(॥రచ్చ॥)
దిగ్గనఁ గొంగేల పట్టీ తెరవేయుమనవే
బగ్గన నొంటినే వొడఁబరచే నేను
వెగ్గళించనేఁటికే వేడుకగలవానికి
సిగ్గుతోడ నుండితేనే చెలులు వలతురు

(॥రచ్చ॥)
చన్నులేల పిసికీఁ బచ్చడము గప్పుమనవే
విన్నవించి వేడుక గావించే నేను
అన్నిటా శ్రీవేంకటేశుఁ డంతలోనె నన్ను నేలె
సన్నలఁదా నవ్వతేనే సతులు వలతురు

(||pallavi||)
rachchalom̐ bĕnam̐gudurā rāmala toḍa
yichchĕrim̐gi kalaside niṁtulu valaduru

(||rachcha||)
yikkaḍanela sĕnagī niṁki rammanave
sĕkku nŏkki tanaseva sese nenu
mŏkkaḽabum̐danamele mŏgavām̐ḍaina vānigi
kakkasiṁchaguṁḍidene kāṁtalu valaduru

(||rachcha||)
digganam̐ gŏṁgela paṭṭī tĕraveyumanave
baggana nŏṁṭine vŏḍam̐barase nenu
vĕggaḽiṁchanem̐ṭige veḍugagalavānigi
siggudoḍa nuṁḍidene sĕlulu valaduru

(||rachcha||)
sannulela pisigīm̐ bachchaḍamu gappumanave
vinnaviṁchi veḍuga gāviṁche nenu
anniḍā śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ nannu nelĕ
sannalam̐dā navvadene sadulu valaduru