రచ్చలఁబెట్ట కతని రారే మీఁద
(॥పల్లవి॥)
రచ్చలఁబెట్ట కతని రారే మీఁద
చెచ్చెర నాయింటిదిక్కు చిత్తగించీ దానే
(॥రచ్చ॥)
అతఁ డెఱిఁగినవే అన్నిబుద్దులును భూమి
యీతల చెలులు సారెనేల చెప్పేరే
నీతిగలవాఁ డతఁడు నిక్కలఁ గందాన నేను
యేతుల నేఁడే చనవు లిచ్చీనే తాను
(॥రచ్చ॥)
రమణుఁ డిచ్చినవే రాఁపులవిడేలెల్ల
జమళి మీరే లతని సాదించేరే
మమత గలఁ డాతఁడు మాటగొన్నదాన నేను
సమముగా నాపైఁ జేయిచాఁచీనే తాను
(॥రచ్చ॥)
శ్రీవేంకటేశ్వరుడేఁ చేసినచేఁత లన్నియు
వేవేలుచందాల నేల వేసరించేరే
కావించి యీతఁడె నన్నుఁ గలసె నేను మెచ్చితి
తావుల నిట్లా నాకు దక్కెనే తాను
(||pallavi||)
rachchalam̐bĕṭṭa kadani rāre mīm̐da
sĕchchĕra nāyiṁṭidikku sittagiṁchī dāne
(||rachcha||)
adam̐ ḍĕṟim̐ginave annibuddulunu bhūmi
yīdala sĕlulu sārĕnela sĕppere
nīdigalavām̐ ḍadam̐ḍu nikkalam̐ gaṁdāna nenu
yedula nem̐ḍe sanavu lichchīne tānu
(||rachcha||)
ramaṇum̐ ḍichchinave rām̐pulaviḍelĕlla
jamaḽi mīre ladani sādiṁchere
mamada galam̐ ḍādam̐ḍu māḍagŏnnadāna nenu
samamugā nābaim̐ jeyisām̐sīne tānu
(||rachcha||)
śhrīveṁkaḍeśhvaruḍem̐ sesinasem̐ta lanniyu
vevelusaṁdāla nela vesariṁchere
kāviṁchi yīdam̐ḍĕ nannum̐ galasĕ nenu mĕchchidi
tāvula niṭlā nāgu dakkĕne tānu