Rachchalam bettaga yitte raavayyaa

రచ్చలఁ బెట్టక యిట్టే రావయ్యా
Language

(॥పల్లవి॥)
రచ్చలఁ బెట్టక యిట్టే రావయ్యా
గచ్చులు మాని యిన్నీఁ గనుకోవయ్యా

(॥రచ్చల॥)
పంతము దప్పదు నీతో బలికినమాత్రమున
వంతుకుఁ జెలి కిందులో వాసి వోదు
యింతిచేత నేఁ జెప్పించే యెడమాట లీడ నేల
వింతల నీ సుద్దు లిందే వినుకోవయ్యా

(॥రచ్చల॥)
సూటి దప్ప దింతలోనే చూచిన మాత్రమున
ఆఁటదాని కిందుకుఁగా నాస వోదు
కూటమి నాపెచేత గురుతులు పట్టింపించే
దీఁట నైనా నాచేఁతలు తెలుసుకోవయ్యా

(॥రచ్చల॥)
ఘనత లేమీఁ దప్పదు కాఁగిలించినంతలోనే
పెనఁగించె ఆపెచేత పెరిమె వోదు
చెనకి కూడితి విట్టే చేరి శ్రీవెంకటేశుఁడ
మన సిచ్చి రక్షించి మన్నించుకోవయ్యా

(||pallavi||)
rachchalam̐ bĕṭṭaga yiṭṭe rāvayyā
gachchulu māni yinnīm̐ ganugovayyā

(||rachchala||)
paṁtamu dappadu nīdo baliginamātramuna
vaṁtugum̐ jĕli kiṁdulo vāsi vodu
yiṁtiseda nem̐ jĕppiṁche yĕḍamāḍa līḍa nela
viṁtala nī suddu liṁde vinugovayyā

(||rachchala||)
sūḍi dappa diṁtalone sūsina mātramuna
ām̐ṭadāni kiṁdugum̐gā nāsa vodu
kūḍami nābĕseda gurudulu paṭṭiṁpiṁche
dīm̐ṭa nainā nāsem̐talu tĕlusugovayyā

(||rachchala||)
ghanada lemīm̐ dappadu kām̐giliṁchinaṁtalone
pĕnam̐giṁchĕ ābĕseda pĕrimĕ vodu
sĕnagi kūḍidi viṭṭe seri śhrīvĕṁkaḍeśhum̐ḍa
mana sichchi rakṣhiṁchi manniṁchugovayyā