Rachchalam bade valabu raavayyaa

రచ్చలఁ బడె వలపు రావయ్యా
Language

(॥పల్లవి॥)
రచ్చలఁ బడె వలపు రావయ్యా
చెచ్చర వచ్చి ప్రియాలు చెప్పించుకోవయ్యా

(॥రచ్చ॥)
దగదొట్టెవలపు తరుణి నిట్టూర్పుల
యెగసక్కెములు సేసే వేమయ్యా
చిగిరించెవలపు చిత్తములో కోరికల
మొగముచూచియైన మొక్కించుకోరాదా

(॥రచ్చ॥)
కుచ్చిపారీ వలపులు కొమ్మచెమట యేరుల
మచ్చరమేమి గల్లాను మానవయ్యా
పచ్చనాయ వలపులు పలు పులకపైరుల
ముచ్చటాడి ఆపెచేత మొక్కించుకోరాదా

(॥రచ్చ॥)
నాని విరిసె వలపు నాతి సెలవినవ్వుల
లేని తరితీపుమాని లేవయ్యా
కోనల శ్రీవేంకటేశ కూడితిరి మీరిద్దరు
మోనాన నూరకే యిట్టె మొక్కించుకోరాదా

(||pallavi||)
rachchalam̐ baḍĕ valabu rāvayyā
sĕchchara vachchi priyālu sĕppiṁchugovayyā

(||rachcha||)
dagadŏṭṭĕvalabu taruṇi niṭṭūrbula
yĕgasakkĕmulu sese vemayyā
sigiriṁchĕvalabu sittamulo korigala
mŏgamusūsiyaina mŏkkiṁchugorādā

(||rachcha||)
kuchchibārī valabulu kŏmmasĕmaḍa yerula
machcharamemi gallānu mānavayyā
pachchanāya valabulu palu pulagabairula
muchchaḍāḍi ābĕseda mŏkkiṁchugorādā

(||rachcha||)
nāni virisĕ valabu nādi sĕlavinavvula
leni taridībumāni levayyā
konala śhrīveṁkaḍeśha kūḍidiri mīriddaru
monāna nūrage yiṭṭĕ mŏkkiṁchugorādā