Rachchala nannelayimchee rammanane yidu nemdu

రచ్చల నన్నెలయించీ రమ్మననే యిటు నేఁడు
Language

(॥పల్లవి॥)
రచ్చల నన్నెలయించీ రమ్మననే యిటు నేఁడు
మచ్చిక నాకు ఘనము మరి యేమి సేతునే

(॥రచ్చ॥)
వుడివోని మాటలూ వుల్లాసపుఁ బాటలూ
యెడనెడఁ బచరించీ యేమి సేతునే
విడువదు మదము విరహమే వుమ్మదము
జడిసీ నామేన నిదె సరి నేమి సేతునే

(॥రచ్చ॥)
పచ్చి వెచ్చి చేఁతలు బట్టబయలీఁతలు
యెచ్చరించీ నీకు నిఁక నేమి సేతునే
వచ్చె నాకిచ్చిన బాస వదలదు నాయాస
కొచ్చీ నిదె నావలపు కోరి కేమిసేతునే

(॥రచ్చ॥)
సేసీనే నెపము సిగ్గులకేదే రపము
యే సుద్దులును నెరఁగఁ డేమి సేతునే
రాసికెక్క శ్రీ వేంకటరమణుఁడు దా నేలె
పోసరించీ నా ముదము పొంచి యేమిసేతునే

(||pallavi||)
rachchala nannĕlayiṁchī rammanane yiḍu nem̐ḍu
machchiga nāgu ghanamu mari yemi sedune

(||rachcha||)
vuḍivoni māḍalū vullāsabum̐ bāḍalū
yĕḍanĕḍam̐ basariṁchī yemi sedune
viḍuvadu madamu virahame vummadamu
jaḍisī nāmena nidĕ sari nemi sedune

(||rachcha||)
pachchi vĕchchi sem̐talu baṭṭabayalīm̐talu
yĕchchariṁchī nīgu nim̐ka nemi sedune
vachchĕ nāgichchina bāsa vadaladu nāyāsa
kŏchchī nidĕ nāvalabu kori kemisedune

(||rachcha||)
sesīne nĕbamu siggulagede rabamu
ye suddulunu nĕram̐gam̐ ḍemi sedune
rāsigĕkka śhrī veṁkaḍaramaṇum̐ḍu dā nelĕ
posariṁchī nā mudamu pŏṁchi yemisedune