రావే వో చెలియా రమణుని వద్దకి
(॥పల్లవి॥)
రావే వో చెలియా రమణుని వద్దకి
యీవల నితని నేమీ నెగ్గు లెంచఁ దగదు
(॥॥)
యెంచరాని మచ్చరము లెన్నెన్ని గలిగినాను
మంచి మాట లాడితేనే మతి గరఁగు
పంచబాణు శరములు పై కొని యెంత వచ్చినా
అంచలఁ గూడుకొంటేను అంటవు విరహులా
(॥॥)
చేయరాని చేఁత లేమి సేసినవి గలిగినా
చాయలకు నవ్వితేనే చవి వుట్టును
పాయక చంద్రకళ లేపాటి వేఁడి చూపినాను
చేయారఁ గూడితే నేమీఁ జేయవు విరహులా
(॥॥)
తనివోని తమకము తగ నెంతఁ గలిగినా
పెనఁగినంతటి మీఁదఁ బ్రియము లౌను
మును కోవిల కూఁ తలు ముంచినా శ్రీ వేంకటేశుఁ
డెనసె తామూఁ గూడితే నెంచవు విరహులా
(||pallavi||)
rāve vo sĕliyā ramaṇuni vaddagi
yīvala nidani nemī nĕggu lĕṁcham̐ dagadu
(||||)
yĕṁcharāni machcharamu lĕnnĕnni galiginānu
maṁchi māḍa lāḍidene madi garam̐gu
paṁchabāṇu śharamulu pai kŏni yĕṁta vachchinā
aṁchalam̐ gūḍugŏṁṭenu aṁṭavu virahulā
(||||)
seyarāni sem̐ta lemi sesinavi galiginā
sāyalagu navvidene savi vuṭṭunu
pāyaga saṁdragaḽa lebāḍi vem̐ḍi sūbinānu
seyāram̐ gūḍide nemīm̐ jeyavu virahulā
(||||)
tanivoni tamagamu taga nĕṁtam̐ galiginā
pĕnam̐ginaṁtaḍi mīm̐dam̐ briyamu launu
munu kovila kūm̐ talu muṁchinā śhrī veṁkaḍeśhum̐
ḍĕnasĕ tāmūm̐ gūḍide nĕṁchavu virahulā