రావే చూతువుగాని రమణి నీ భాగ్యమాయ
(॥పల్లవి॥)
రావే చూతువుగాని రమణి నీ భాగ్యమాయ
నీ విలాసా లితని నేఁ డింత సేసెసే
(॥రావే॥)
కలికితనాల వీ కనుబొమ్మజంకెనలు
పిలిచేపెదవుల పై ప్రియములు
సెలవులఁ జిందేటి చిరుసిగ్గునగవులు
వలపించి రమణుని వాకిటికిఁ దెచ్చెనే
(॥రావే॥)
మునుకొని సొలసే నీములువాఁడి చూపులు
ననుపులు దొలఁకేనున్ననీ మాఁటలు
పెనచిపెట్టిన నీ పెనుఁగొప్పు మురిపేలు
ఘనుఁడైన విభుని నీకైవసము సేసెనే
(॥రావే॥)
కావరపుఁ జెలకుల గయ్యాళి నీ చేఁతలు
తావులు గుబులుకొనే తను సోఁకులు
భానములు గరఁగించే పంతపు సరసములు
శ్రీవేంకటేశ్వరు నిన్నుఁ జిక్కించి కూడించెనే
(||pallavi||)
rāve sūduvugāni ramaṇi nī bhāgyamāya
nī vilāsā lidani nem̐ ḍiṁta sesĕse
(||rāve||)
kaligidanāla vī kanubŏmmajaṁkĕnalu
pilisebĕdavula pai priyamulu
sĕlavulam̐ jiṁdeḍi sirusiggunagavulu
valabiṁchi ramaṇuni vāgiḍigim̐ dĕchchĕne
(||rāve||)
munugŏni sŏlase nīmuluvām̐ḍi sūbulu
nanubulu dŏlam̐kenunnanī mām̐ṭalu
pĕnasibĕṭṭina nī pĕnum̐gŏppu muribelu
ghanum̐ḍaina vibhuni nīgaivasamu sesĕne
(||rāve||)
kāvarabum̐ jĕlagula gayyāḽi nī sem̐talu
tāvulu gubulugŏne tanu som̐kulu
bhānamulu garam̐giṁche paṁtabu sarasamulu
śhrīveṁkaḍeśhvaru ninnum̐ jikkiṁchi kūḍiṁchĕne