Raave aadamdu ninnu ramtusesi piliseeni

రావే ఆతఁడు నిన్ను రంతుసేసి పిలిచీని
Language

(॥పల్లవి॥)
రావే ఆతఁడు నిన్ను రంతుసేసి పిలిచీని
తావులనే లోఁగుటే తగు నేరుపు

(॥రావే॥)
బలిమిఁ బెనఁగరాదు పాయపువారికెల్ల
వలనైనచనవు చూపవలెఁగాని
కలిగినవేడుకలు కై వ్రాలకుండాను
నెలవునఁ గూడుటే నెరవైననేరుపు

(॥రావే॥)
వాదు లడువఁగరాదు వలచినవారికెల్ల
సేదదేరి చెప్పినట్లు చేసుటేకాని
పోదిగొన్న కోరికలు పొది విచ్చకుండాను
సాదువలె లోనౌటె చక్కనినేరుపు

(॥రావే॥)
సిగ్గులువడఁగరాదు సేసపాలవారి కెల్ల
నిగ్గులఁ గాఁగిటఁ గూడి నిక్కు టేకాని
అగ్గమై శ్రీవేంకటేశుఁ డరిసి నిన్నుఁ గలసె
కగ్గులేక సుఖించుటే కడునేరుపు

(||pallavi||)
rāve ādam̐ḍu ninnu raṁtusesi pilisīni
tāvulane lom̐guḍe tagu nerubu

(||rāve||)
balimim̐ bĕnam̐garādu pāyabuvārigĕlla
valanainasanavu sūbavalĕm̐gāni
kaliginaveḍugalu kai vrālaguṁḍānu
nĕlavunam̐ gūḍuḍe nĕravainanerubu

(||rāve||)
vādu laḍuvam̐garādu valasinavārigĕlla
sedaderi sĕppinaṭlu sesuḍegāni
podigŏnna korigalu pŏdi vichchaguṁḍānu
sāduvalĕ lonauḍĕ sakkaninerubu

(||rāve||)
sigguluvaḍam̐garādu sesabālavāri kĕlla
niggulam̐ gām̐giḍam̐ gūḍi nikku ṭegāni
aggamai śhrīveṁkaḍeśhum̐ ḍarisi ninnum̐ galasĕ
kaggulega sukhiṁchuḍe kaḍunerubu