రావయ్యా యెక్కడి సుద్ది రచ్చలఁ బెట్టక మమ్ము
(॥పల్లవి॥)
రావయ్యా యెక్కడి సుద్ది రచ్చలఁ బెట్టక మమ్ము
దేవరవలె నీవుంటేఁ దిట్టఁ గలమా
(॥॥)
నీ విచ్చిన చనవున నిన్ను నంటిఁ గాక
వోవఁ జాలకుంటే నిన్ను నొరసేమా
వావి గలుగఁగ నీపై వలపు చల్లితిఁ గాక
తోవ రాకుంటే నిన్ను దూరవచ్చేమా
(॥॥)
చేతికి లోనై వుండఁగాఁ జెనకితి నింతేకాక
కాతరించి పెనఁగితే కక్కసించేమా
ఆతుమై నీవుండఁగా మాయాడకు రమ్మంటిఁ గాక
ఘాతలు చూపితే నిన్ను గాసి సేసేమా
(॥॥)
మచ్చిక నీవు గూడఁగా మర్మము లంటితిఁ గాక
పెచ్చు వెరిగితే నిన్నుఁ బెడరేచేమా
ఇచ్చల శ్రీవేంకటేశ యెనసితివిటు నన్ను
పచ్చి సేసితే నీతోఁ బంత మాడేమా
(||pallavi||)
rāvayyā yĕkkaḍi suddi rachchalam̐ bĕṭṭaga mammu
devaravalĕ nīvuṁṭem̐ diṭṭam̐ galamā
(||||)
nī vichchina sanavuna ninnu naṁṭim̐ gāga
vovam̐ jālaguṁṭe ninnu nŏrasemā
vāvi galugam̐ga nībai valabu sallidim̐ gāga
tova rāguṁṭe ninnu dūravachchemā
(||||)
sedigi lonai vuṁḍam̐gām̐ jĕnagidi niṁtegāga
kādariṁchi pĕnam̐gide kakkasiṁchemā
ādumai nīvuṁḍam̐gā māyāḍagu rammaṁṭim̐ gāga
ghādalu sūbide ninnu gāsi sesemā
(||||)
machchiga nīvu gūḍam̐gā marmamu laṁṭidim̐ gāga
pĕchchu vĕrigide ninnum̐ bĕḍaresemā
ichchala śhrīveṁkaḍeśha yĕnasidiviḍu nannu
pachchi seside nīdom̐ baṁta māḍemā