రావయ్యా మన వలపు రచ్చల నేల పెట్టేవు
(॥పల్లవి॥)
రావయ్యా మన వలపు రచ్చల నేల పెట్టేవు
వేవేలు సరసాలకు వేళ లేదా యిఁకను
(॥॥)
ఆడఁగా నాడఁగా మాట లంటు బచ్చలి వంటివి
చూడఁ జూడఁ జూపులు చూచి మరపు
యేడ గొలఁదీ యాసల నెందాఁకా వేగించవచ్చు
కూడిన కూటములే గురుతులేఁ గాకా
(॥॥)
చేరఁగాఁ జేరఁగా పొందు జిగురుఁగండెవంటిది
కొరఁ గొరఁ గొరికే కొండవంటిది
యీ రీతిఁ దమకము లెటువలె నాఁప వచ్చు
వొరసేయని కౌఁగిళ్ళ నుబ్బు గలుగుఁ గాకా
(॥॥)
పెంచఁగాఁ బెంచఁగాఁ దమి పెనుఁ దొడుసువంటిది
నించ నించ సిగ్గులు వన్నెలవంటివి
యెంచఁగ శ్రీ వేంకటేశ ఇట్టే నన్ను నేలితివి
ముంచిన రతులివే మునుకొనుఁ గాకా
(||pallavi||)
rāvayyā mana valabu rachchala nela pĕṭṭevu
vevelu sarasālagu veḽa ledā yim̐kanu
(||||)
āḍam̐gā nāḍam̐gā māḍa laṁṭu bachchali vaṁṭivi
sūḍam̐ jūḍam̐ jūbulu sūsi marabu
yeḍa gŏlam̐dī yāsala nĕṁdām̐kā vegiṁchavachchu
kūḍina kūḍamule gurudulem̐ gāgā
(||||)
seram̐gām̐ jeram̐gā pŏṁdu jigurum̐gaṁḍĕvaṁṭidi
kŏram̐ gŏram̐ gŏrige kŏṁḍavaṁṭidi
yī rīdim̐ damagamu lĕḍuvalĕ nām̐pa vachchu
vŏraseyani kaum̐giḽḽa nubbu galugum̐ gāgā
(||||)
pĕṁcham̐gām̐ bĕṁcham̐gām̐ dami pĕnum̐ dŏḍusuvaṁṭidi
niṁcha niṁcha siggulu vannĕlavaṁṭivi
yĕṁcham̐ga śhrī veṁkaḍeśha iṭṭe nannu nelidivi
muṁchina radulive munugŏnum̐ gāgā