Raavayyaa imkanela ravvasesevu valabu

రావయ్యా ఇఁకనేల రవ్వసేసేవు వలపు
Language

(॥పల్లవి॥)
రావయ్యా ఇఁకనేల రవ్వసేసేవు వలపు
కైవసమయినవారిఁ గారించవలదు

(॥రావ॥)
ఆఁపరానితమితోడ నాపె యెదురుచూడఁగా
మాపుదాఁకాఁ జెలులతో మాటలాడేవు
కాఁపురాలు సేసేమని కాచుకున్న వారి నింత
యేఁపులఁ బెట్టితే నిన్ను నెట్టు నమ్మేరిఁకను

(॥రా॥)
ప్రేమతోడ నిన్ను నాపె పేరుకొని పిలువఁగా
నామోము దప్పక చూచి నవ్వు నవ్వేవు
కామించివచ్చినయట్టికాంతలనింతసేసితే
యేమగువలై నాను యెట్టు నమ్మేరిఁకను

(॥రావ॥)
కమ్మి యల మేలుమంగ కాఁగిలించుకొనఁగాను
చిమ్ముల నీలోనే యేల సిగ్గువడేవు
ఇమ్ముల శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
యెమ్మెకాఁడవై తేఁ బరులెట్లు నమ్మేరిఁకను

(||pallavi||)
rāvayyā im̐kanela ravvasesevu valabu
kaivasamayinavārim̐ gāriṁchavaladu

(||rāva||)
ām̐parānidamidoḍa nābĕ yĕdurusūḍam̐gā
mābudām̐kām̐ jĕlulado māḍalāḍevu
kām̐purālu sesemani kāsugunna vāri niṁta
yem̐pulam̐ bĕṭṭide ninnu nĕṭṭu nammerim̐kanu

(||rā||)
premadoḍa ninnu nābĕ perugŏni piluvam̐gā
nāmomu dappaga sūsi navvu navvevu
kāmiṁchivachchinayaṭṭigāṁtalaniṁtaseside
yemaguvalai nānu yĕṭṭu nammerim̐kanu

(||rāva||)
kammi yala melumaṁga kām̐giliṁchugŏnam̐gānu
simmula nīlone yela sigguvaḍevu
immula śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
yĕmmĕgām̐ḍavai tem̐ barulĕṭlu nammerim̐kanu