రావయ్యా ఇఁకనైనా రమణి వేఁడుకొనీని
(॥పల్లవి॥)
రావయ్యా ఇఁకనైనా రమణి వేఁడుకొనీని
వావిరి నీకెతో నింత వాసు లెంచఁదగునా
(॥రావ॥)
పంతమాడరాదుగాని పచారించి నవ్వవచ్చు
మంతనాన సతికిని మగనితోను
వింతసేయరాదుగాని వెంగెమైనా నాడవచ్చు
చెంతఁదనమాట చెల్లించేవానితోను
(॥రావ॥)
సిగ్గుపడరాదుగాని చేరి జంకించఁగవచ్చు
కగ్గక తనపై బత్తిగల వానితోను
వెగ్గళించరాదుగాని వేమారుఁ గొసరవచ్చు
నిగ్గులఁ దన్ను మన్నించే నెరజాణతోను
(॥రావ॥)
రచ్చఁ బెట్టరాదుగాని రతిఁ బెనఁగఁగవచ్చు
యెచ్చటా నెగ్గుపట్టనియిష్టునితోను
మచ్చరించరాదు గాని మనసు గరఁచవచ్చు
కచ్చు పెట్టికూడే శ్రీవేంకటేశుఁడ నీతోను
(||pallavi||)
rāvayyā im̐kanainā ramaṇi vem̐ḍugŏnīni
vāviri nīgĕdo niṁta vāsu lĕṁcham̐dagunā
(||rāva||)
paṁtamāḍarādugāni pasāriṁchi navvavachchu
maṁtanāna sadigini maganidonu
viṁtaseyarādugāni vĕṁgĕmainā nāḍavachchu
sĕṁtam̐danamāḍa sĕlliṁchevānidonu
(||rāva||)
siggubaḍarādugāni seri jaṁkiṁcham̐gavachchu
kaggaga tanabai battigala vānidonu
vĕggaḽiṁcharādugāni vemārum̐ gŏsaravachchu
niggulam̐ dannu manniṁche nĕrajāṇadonu
(||rāva||)
rachcham̐ bĕṭṭarādugāni radim̐ bĕnam̐gam̐gavachchu
yĕchchaḍā nĕggubaṭṭaniyiṣhṭunidonu
machchariṁcharādu gāni manasu garam̐savachchu
kachchu pĕṭṭigūḍe śhrīveṁkaḍeśhum̐ḍa nīdonu