రావయ్య యింకనూ రమణుఁడ లోనికి
(॥పల్లవి॥)
రావయ్య యింకనూ రమణుఁడ లోనికి
యీవలఁ జలము మనకిఁకనేలయ్యా
(॥రావ॥)
వాసులెల్లా నామాఁట వన్నెలెల్లా నీమాఁట
సేసినట్టెల్లా మనకుఁ జెల్లునయ్యా
వేసరవు మనసులు వేడుకైన రతులకు
యీసులు రేసులు మనకిఁకనేలయ్యా
(॥రావ॥)
పంతమెల్లా నాసొమ్ము పలుకెల్లా నీసొమ్ము
చెంతలఁ జేసినవెల్లాఁ జెల్లువయ్యా
దొంతినే తమకములు దోమటిదొడుకఁజొచ్చె
యింతలోనే బిగువులు ఇఁకనేలనయ్యా
(॥రావ॥)
యెగ్గులు నేఁబట్టితి యెమ్మెలు నీవు సేసితివి
సిగ్గులువిడువ నిఁకఁ జెల్లునయ్యా
అగ్గమై శ్రీ వేంకటేశ అన్నిటాఁ గూడి తిమిదె
యిగ్గుచునుందము వెర పిఁకనేలయా
(||pallavi||)
rāvayya yiṁkanū ramaṇum̐ḍa lonigi
yīvalam̐ jalamu managim̐kanelayyā
(||rāva||)
vāsulĕllā nāmām̐ṭa vannĕlĕllā nīmām̐ṭa
sesinaṭṭĕllā managum̐ jĕllunayyā
vesaravu manasulu veḍugaina radulagu
yīsulu resulu managim̐kanelayyā
(||rāva||)
paṁtamĕllā nāsŏmmu palugĕllā nīsŏmmu
sĕṁtalam̐ jesinavĕllām̐ jĕlluvayyā
dŏṁtine tamagamulu domaḍidŏḍugam̐jŏchchĕ
yiṁtalone biguvulu im̐kanelanayyā
(||rāva||)
yĕggulu nem̐baṭṭidi yĕmmĕlu nīvu sesidivi
sigguluviḍuva nim̐kam̐ jĕllunayyā
aggamai śhrī veṁkaḍeśha anniḍām̐ gūḍi timidĕ
yiggusunuṁdamu vĕra pim̐kanelayā